- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వలసదారులకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ.. నిరసనలతో దద్దరిల్లిన లండన్
వలసదారులకు వ్యతిరేకంగా లండన్‌లో నిరసనలు మొదలయ్యాయి. శనివారం నిరసనలు తీవ్రతరం అవ్వడంతో లండన్ వలస వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిపోతోంది.

దిశ, వెబ్ డెస్క్: వలసదారులకు వ్యతిరేకంగా లండన్‌లో నిరసనలు మొదలయ్యాయి. శనివారం నిరసనలు తీవ్రతరం అవ్వడంతో లండన్ వలస వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిపోతోంది. యునైట్ ద కింగ్డమ్ పేరుతో యాంటీ ఇమిగ్రెంట్, యాంటీ ఇస్లాం కార్యకర్త టామీ రాబిన్సన్ నేతృత్వంలో లక్షకు పైగా మంది ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. ప్రధాని కీర్ స్టార్మర్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. వలసదారులను బ్రిటన్ నుండి పంపించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
ఈ నిరసన ర్యాలీలో దాదాపు 1.10 లక్షల మంది నుండి 1.50 లక్షల మంది పాల్గొన్నారని మెట్రోపాలిటన్ పోలీసులు వెల్లడించారు. లండన్ లో జరిగిన నిరసనల్లో ఇదే అతిపెద్దదని పోలీసులు తెలిపారు. మరోవైపు జాత్యాహంకారానికి వ్యతిరేకంగా స్టాండ్ అప్ టు రేసిజమ్ అని వలసవాదులు నిరనస తెలిపారు. ఇందులో దాదాపు 5 వేల మంది పాల్గొన్నారు. ఈ క్రమంలో ఎలాంటి ఉధ్రిక్తతలు చోటు చేసుకోకుండా పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులపై వాటర్ బాటిళ్ల, ఇతర వస్తువులతో దాడి చేయగా కొందరు అధికారులు గాయపడ్డారు. ప్రస్తుతం ఈ నిరసనలతో లండన్ లో ఉధ్రిక్త పరిస్థితి నెలకొంది.






