- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vancouver: కెనడాలోని స్ట్రీట్ ఫెస్టివల్ లో ఘోర ప్రమాదం
కెనడాలోని వాంకోవర్ నగరంలో స్ట్రీట్ ఫెస్టివల్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఫెస్టివల్ లో జనంపైకి ఓ వాహనం దూసుకుపోవడంతో పలువురు మృతి చెందారు.

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలోని వాంకోవర్ నగరంలో స్ట్రీట్ ఫెస్టివల్ లో ఘోర ప్రమాదం జరిగింది. ఫెస్టివల్ లో జనంపైకి ఓ వాహనం దూసుకుపోవడంతో పలువురు మృతి చెందారు. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం ఈస్ట్ 41వ అవెన్యూ, ఫ్రెజర్ స్ట్రీట్‌లో లాపులాపు డే బ్లాక్ పార్టీ ఫెస్టివల్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న వారిపైకి ఓ వాహనం దూసుకెళ్లింది. దీంతో పలువురు మరణించినట్లు స్థానిక పోలీసులు ఎక్స్‌లో వెల్లడించారు. అయితే.. ఎంత మంది చనిపోయారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. కాగా.. ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ఈ దారుణానికి కారణమైన డ్రైవర్ ను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇది ప్రమాదమా.. లేదా కావాలని చేసిన దాడో తెలియాల్సి ఉంది. మరోవైపు, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మృతులకు సంతాపం తెలిపారు. చనిపోయిన వారిలో చాలా మంది ఫిలిప్పినో- కెనడా జాతీయులే ఉన్నట్లు తెలిపారు. వాంకోవర్ మేయర్ కెన్ సిమ్, బ్రిటిష్ కొలంబియా ప్రీమియర్ డేవిడ్ ఎబే ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు.






