- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Landslide: కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి.. హిమాచల్ ప్రదేశ్‌లో ఘటన
కులులోని పర్యాటక కేంద్రమైన గురుద్వారా మణికరణ్ సాహిబ్ సమీపంలో కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందగా ఐదుగురు గాయపడ్డారు.

దిశ, నేషనల్ బ్యూరో: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కులులోని పర్యాటక కేంద్రమైన గురుద్వారా మణికరణ్ సాహిబ్ (Manikaran sahib) సమీపంలో కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి చెందగా.. ఐదుగురు గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం బలమైన గాలుల కారణంగా ఒక పెద్ద చెట్టు కూలిపోయింది. దానితో పాటే కొండచరియలు విరిగిపడి రోడ్డుపై ఆగి ఉన్న పలు వాహనాలపై పడ్డాయి. దీంతో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శిథిలాల కింద చిక్కుకుని మరణించిన వారి మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు.
గాయపడిన వారిలో హర్యానాకు చెందిన ఒకరు, బెంగళూరుకు చెందిన ముగ్గురు, అసోం చెందిన ఇద్దరు ఉండగా మృతుల వివరాలు వెల్లడించలేదు. ఈ ఘటనపై సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు (Sukhvinder Singh Sukhu) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు, వారి కుటుంబాలకు సాధ్యమైనంత సహాయం అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని సూచించారు. అలాగే ప్రతిపక్ష నేత జై రామ్ ఠాకూర్ (Jai ram Takur) సైతం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు.






