- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పూంచ్ లో పాఠశాలపై విరిగిపడ్డ కొండ చరియలు.. ఒకరి మృతి
జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్(Poonch) జిల్లాలోని చోలన్ కల్సన్ గ్రామంలో నేడు ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (కల్సియన్ బైంచ్)పై కొండచరియలు(Land Slides) విరిగిపడ్డాయి.

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్(Poonch) జిల్లాలోని చోలన్ కల్సన్ గ్రామంలో నేడు ఒక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల (కల్సియన్ బైంచ్)పై కొండచరియలు(Land Slides) విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, నలుగురు విద్యార్థులు, ఒక ఉపాధ్యాయుడు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పూంచ్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి 5 సంవత్సరాల వయస్సు గలవాడని తెలుస్తోంది. ఈ దుర్ఘటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
గాయపడిన వారికి సరైన వైద్య సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. పూంచ్ జిల్లా కలెక్టర్ వికాస్ కుండల్, ఎసిఆర్ మహమ్మద్ సయీద్ ఆసుపత్రిని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






