డీప్‌ఫేక్ కట్టడికి సంచలన నిర్ణయం.. మెటా, ఎక్స్‌, గూగుల్‌కు గుజరాత్ హైకోర్టు నోటీసులు

by Kema Shiva Kumar |   (  Updated:2026-04-15 10:32:10  IST  )

డీప్‌ఫేక్ కంటెంట్‌ను అరికట్టేందుకు గుజరాత్ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది.

డీప్‌ఫేక్ కట్టడికి సంచలన నిర్ణయం.. మెటా, ఎక్స్‌, గూగుల్‌కు గుజరాత్ హైకోర్టు నోటీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: డీప్‌ఫేక్ (Deep Fake కంటెంట్‌ను అరికట్టేందుకు గుజరాత్ హైకోర్టు కఠినంగా వ్యవహరించాలని కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో సృష్టించే ఫేక్ వీడియోలు, ఫోటోల వల్ల ప్రజా శాంతికి భంగం కలుగుతోందని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై కోర్టు స్పందించింది. అయితే, ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కోరుతూ గూగుల్ (Google), మెటా (Meta), ఎక్స్ (X), రెడ్డిట్ (Reddit) స్క్రిబ్డ్ (Scribd) వంటి సంస్థలకు కోర్టు నోటీసులు జారీ చేసింది. మే 8వ తేదీలోగా వీటిపై స్పందించాలని ఆదేశించింది.

‘సహయోగ్’ పోర్టల్‌లో చేరాలి..

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘సహయోగ్’ (Sahyog) పోర్టల్‌లో ఈ సంస్థలన్నీ తప్పనిసరిగా భాగస్వాములు కావాలని కోర్టు సూచించింది. చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను నిర్ణీత కాలపరిమితిలోగా తొలగించేందుకు ఈ పోర్టల్ సమన్వయకర్తగా పనిచేస్తుంది. విచారణ సందర్భంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కీలక విషయాలను కోర్టు దృష్టికి తెచ్చింది. సోషల్ మీడియా సంస్థలు, ముఖ్యంగా ‘ఎక్స్’ (X), ప్రభుత్వం పంపే నోటీసులకు సరిగ్గా స్పందించడం లేదని తెలిపింది. 2024 నుంచి 2026 మధ్య కాలంలో పంపిన 94 నోటీసులలో కేవలం 13 వాటికి మాత్రమే సమాధానం వచ్చిందని వెల్లడించింది. వికాస్ నాయర్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్‌లో.. ప్రస్తుతం ఉన్న ఐటీ చట్టాలు AI టెక్నాలజీని నియంత్రించడానికి సరిపోవని పేర్కొన్నారు. డీప్‌ఫేక్ వీడియోల వల్ల ప్రజాస్వామ్య వ్యవస్థకు, సామాజిక భద్రతకు ముప్పు పొంచి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Next Story