- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రన్‌వేపై విరిగిపోయిన ల్యాండింగ్ గేర్.. ఎయిరిండియా ఫ్లైట్‌కు తప్పిన పెను ప్రమాదం
థాయిలాండ్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన పెను ప్రమాదం తప్పింది. ఫుకెట్ ఎయిర్‌పోర్టులో ల్యాండింగ్ సమయంలో ఫ్లైట్ ల్యాండింగ్ గేర్ ఒక్కసారిగా విరిగిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ నుంచి థాయిలాండ్‌కు బయలుదేరిన ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తినప్పటికీ, పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో విమానంలోని ప్రయాణికులందరూ సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టును నుంచి థాయిలాండ్‌లోని ఫుకెట్ (Phuket) నగరానికి ఎయిరిండియా విమానం బయలుదేరింది. ప్రయాణం సాఫీగానే సాగినా, ఫుకెట్ ఎయిర్‌పోర్టులో ల్యాండ్ అయ్యే సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. రన్‌వేపై విమానం దిగుతున్న క్రమంలో ల్యాండింగ్ గేర్ (Landing Gear) బలంగా తగిలి విరిగిపోయింది.
ప్రమాదకర స్థితిలో ల్యాండింగ్..
ల్యాండింగ్ గేర్ విరిగిపోవడంతో విమానం నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అయినప్పటికీ, పైలట్ అత్యంత చాకచక్యంగా విమానాన్ని రన్‌వేపై నిలిపివేశారు. ఆ సమయంలో విమానం ఒక్కసారిగా కుదుపులకు లోనవడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ విమానంలో మొత్తం 133 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే ఎమర్జెన్సీ సిబ్బంది రంగంలోకి దిగి ప్రయాణికులను కిందకు దించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. తాజాగా ఘటనపై ఎయిరిండియా యాజమాన్యం మరియు ఏవియేషన్ అధికారులు విచారణకు ఆదేశించారు.






