‘ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌’ స్కామ్ కేసు.. లాలుప్రసాద్‌ యాదవ్‌కు షాకిచ్చిన ఢిల్లీ కోర్టు

by Kema Shiva Kumar |   (  Updated:2026-01-09 06:54:13  IST  )

బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుటుంబానికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

‘ల్యాండ్‌ ఫర్‌ జాబ్స్‌’ స్కామ్ కేసు.. లాలుప్రసాద్‌ యాదవ్‌కు షాకిచ్చిన ఢిల్లీ కోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కుటుంబానికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ (Land for Jobs) స్కా్మ్ కేసులో లాలూతో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమారులు తేజస్వీ యాదవ్, తేజ్ ప్రతాప్ యాదవ్, కుమార్తె మీసా భారతిపై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ మోపిన అభియోగాలను సమ్మతించింది. ఈ కేసులో నిందితులు ఒక క్రిమినల్ సిండికేట్‌గా ఏర్పడి కుట్రకు పాల్పడ్డారని స్పెషల్ జడ్జి విశాల్ గోగ్నే (Special Judge Vishal Gogne) కామెంట్ చేశారు.

కాగా, 2004 నుంచి 2009 మధ్య లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా రైల్వేలో గ్రూప్-డీ (Group-D) ఉద్యోగాలు ఇచ్చి, అందుకు ప్రతిఫలంగా అభ్యర్థుల నుంచి తక్కువ ధరకు భూములను తమ కుటుంబ సభ్యుల పేరిట రాయించుకున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. దీంతో జరిగిన స్కామ్‌పై సీబీఐ (CBI) విచారణకు ఆదేశించగా.. ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ స్కామ్‌కు సంబంధించి లోతుగా విచారణ చేపట్టి పక్కా ఆధారాలను అధికారులు కోర్టుకు అందజేశారు. క్విడ్ ప్రోకో జరిగినట్లుగా నిర్ధారణకు వచ్చిన సీబీఐ లాలు ప్రసాద్‌ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై అభియోగాలు మోపింది. తాజాగా కేసులో సాక్ష్యాధారాలను పరిశీలించిన ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ వాదనలను సమర్ధించడంతో లాలూ ఫ్యామిలీకి పొలిటికల్‌గా.. న్యాయపరంగా చిక్కులు ఎదుర్కొనున్నారు.

Next Story