- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lalu: లాలూ ప్రసాద్ యాదవ్‌కు షాక్.. ఆ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు
ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో ట్రయల్ కోర్టు కార్యకలాపాలను నిలిపివేయాలని లాలూ దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ) చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) కు షాక్ తగిలింది. ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ (Land For job scam) కు సంబంధించిన కేసులో ట్రయల్ కోర్టు కార్యకలాపాలను నిలిపివేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు (Delhi hign court) తిరస్కరించింది. ఈ కేసు త్వరలోనే స్పెషల్ కోర్టులో విచారణకు వస్తుందని తెలిపింది. ట్రయల్ కోర్టు ఎదుట తన వాదనలు వినిపించడానికి పిటిషనర్‌కు పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేసింది. ఈ విషయంలో జోక్యం చేసుకోవడానికి ఎటువంటి స్పష్టమైన కారణం కనిపించడం లేదని తెలిపింది. దిగువ కోర్టు కార్యకలాపాలపై స్టే విధించడానికి నిరాకరించింది. కాగా, ల్యాండ్ ఫర్ జాబ్ కేసును ప్రస్తుతం సీబీఐ దర్యాప్తు చేస్తోంది. జూన్ 2న కోర్టులో అభియోగాల నమోదుపై వాదనలు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలోనే లాలూ పిటిషన్ తిరస్కరించడం గమనార్హం.






