- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో నిరాశ.. ల్యాండ్-ఫర్-జాబ్స్ కేసు కొట్టివేతకు నిరాకరణ!
లాలూ ప్రసాద్ యాదవ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు! ల్యాండ్-ఫర్-జాబ్స్ కేసు కొట్టివేతకు నిరాకరణ. వ్యక్తిగత హాజరు నుండి మాత్రం మినహాయింపు.

దిశ, వెబ్ డెస్క్: ఆర్‌జేడీ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ సుప్రీంకోర్టులో నిరాశ మిగిలింది. ల్యాండ్-ఫర్-జాబ్స్ స్కామ్‌కు సంబంధించి తనపై, తన కుటుంబ సభ్యులపై నమోదైన ఎఫ్ఐఆర్ (FIR), తదుపరి చర్యలను కొట్టివేయాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ఎన్. కోటేశ్వర్ సింగ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పునిస్తూ, కేసు విచారణను నిలిపివేయలేమని స్పష్టం చేసింది. అయితే, అనారోగ్య కారణాల దృష్ట్యా విచారణ సమయంలో లాలూ ప్రసాద్ యాదవ్ వ్యక్తిగతంగా ట్రయల్ కోర్టుకు హాజరు కావాల్సిన అవసరం లేదని ధర్మాసనం వెసులుబాటు కల్పించింది.
ట్రయల్ కోర్టుకే నిర్ణయాధికారం..
కేసులోని మెరిట్స్‌ను పరిశీలించే అధికారాన్ని సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టుకే వదిలేసింది. చట్టప్రకారం విచారణ కొనసాగించవచ్చని పేర్కొంది. రైల్వే శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగాల కోసం అభ్యర్థుల నుంచి తక్కువ ధరకు భూములను తన కుటుంబ సభ్యుల పేరిట లాలూ ప్రసాద్ రాయించుకున్నారని ఈ కేసులో ప్రధాన ఆరోపణ. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఈడీ (ED), సీబీఐ (CBI) దర్యాప్తు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో లాలూ కుటుంబానికి ఈ కేసులో న్యాయ పరమైన చిక్కులు మరింత కొనసాగనున్నాయి.






