- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారత న్యాయవ్యవస్థను ఎగతాళి చేసిన లలిత్ మోదీ, విజయ్ మాల్యా
బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని, వాటిని తిరిగి చెల్లించకుండా

దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకుల నుంచి వేలకోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని, వాటిని తిరిగి చెల్లించకుండా దేశం విడిచి పారిపోయిన ఐపీఎల్ మాజీ చైర్మన్ లలిత్ మోదీ, వ్యాపారవేత్త విజయ్ మాల్యా మరోసారి భారత న్యాయవ్యవస్థను, దర్యాప్తు సంస్థలను ఎగతాళి చేసేలా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల లండన్లో విజయ్ మాల్యా బర్త్ డే వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా తీసుకున్న ఒక వీడియోను లలిత్ మోదీ తన ఇన్ స్టా హ్యాండిల్ లో పోస్ట్ చేశాడు. ఆ వీడియోలో లలిత్ మోదీ మాట్లాడుతూ.. దేశం నుంచి పరారైన అతిపెద్ద నేరగాళ్లం తామిద్దరమేనని అన్నాడు. అంతేకాదు.. ఆ వీడియో కింద , ఇంటర్నెట్ ను మరోసారి బ్రేక్ చేసేందుకు ఏదైనా చేయాలిగా. మీరంతా అసూయపడండి అని క్యాప్షన్ రాశాడు. దీంతో ఈ వీడియో దేశవ్యాప్తంగా తీవ్రదుమారం రేపుతోంది. నెటిజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి వీడియోలను చేసే ధైర్యం వాళ్లకు వచ్చిందంటే అది మన చట్టాల వైఫల్యమేనని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత్ కు ఎప్పుడు తిరిగి వస్తారో చెప్పాలని ముంబై హైకోర్టు విజయ్ మాల్యాను ప్రశ్నించిన రోజే ఈ వీడియో పోస్టుకావడం గమనార్హం. మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో, బ్యాంకులకు రూ.9000 కోట్ల రుణాలను ఎగ్గొట్టి 2016లో విజయ్ మాల్యా దేశం వదిలి పరారయ్యారు.






