- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kunal kamra : కునాల్ కామ్రాకు ముందస్తు బెయిల్ మంజూరు
స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా(Standup Comedian Kunal Kamra)కు మద్రాసు హైకోర్ట్(Madras High Court) ముందస్తు బెయిల్(Anticipatory Bail) మంజూరు చేసింది.

దిశ, వెబ్ డెస్క్ : స్టాండప్ కమెడియన్ కునాల్ కామ్రా(Standup Comedian Kunal Kamra)కు మద్రాసు హైకోర్ట్(Madras High Court) ముందస్తు బెయిల్(Anticipatory Bail) మంజూరు చేసింది. ఇటీవల కామ్రా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం తీవ్ర దూమరాన్ని రేపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కామ్రాపై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా.. వచ్చేనెల 7 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ధర్మాసనం. కాగాఆ కునాల్ కామ్రా ముంబైలో నిర్వహించిన ఓ స్టాండప్ కామెడీ షోలో ఏక్ నాథ్ షిండే ను 'గద్దర్' అంటూ పేరడీ పాట పాడటం వివాదాస్పదం అయింది.
అయితే కామ్రా ఎవరి పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. అది షిండేను ఉద్దేశించినవే అని శివసేన సభ్యులు తీవ్రంగా స్పందించి, ఆ స్టూడియోను ధ్వంసం చేయడంతోపాటు..శివసేన ఎమ్మెల్యే ముర్జీ పటేల్ ఫిర్యాదు మేరకు ఖార్ పోలీస్ స్టేషన్‌లో కామ్రాపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ముంబై పోలీసులు అతనికి రెండుసార్లు సమన్లు జారీ చేసి, మార్చి 31 లోపు విచారణకు హాజరు కావాలని ఆదేశించగా, కామ్రా హాజరు కాకుండా వారం రోజుల సమయం కోరగా.. పోలీసులు దానిని తిరస్కరించారు. అయితే ఈ కేసులన్నీ మహారాష్ట్రలో నమోదైనప్పటికీ.. కామ్రా తమిళనాడులోని విల్లుపురంలో నివసిస్తున్నందున.. మద్రాసు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశాడు.






