Kunal Kamra: మరోవివాదంలో చిక్కుకున్న కునాల్ కామ్రా

by Shamantha N |

ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కామ్రా మరోవివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde)పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

Kunal Kamra: మరోవివాదంలో చిక్కుకున్న కునాల్ కామ్రా
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రముఖ స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కామ్రా మరోవివాదంలో చిక్కుకున్నారు. ఇప్పటికే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde)పై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ కేసులో విచారణ జరుగుతుండగానే.. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ని ఉద్దేశిస్తూ కునాల్ మరోపాట పాడారు. ‘మిస్టర్‌ ఇండియా’ సినిమాలోని హవా హవాయి పాటను పేరడీ చేసిన ఆయన.. పన్ను చెల్లింపుదారుల సొమ్ము వృథా అవుతోందంటూ అందులో ఆరోపించారు. "ఆప్కా టాక్స్ కా పైసా హో రహా హై హవా హవాయి (మీ పన్ను డబ్బు వృథా కాబోతోంది)" అనే శీర్షికతో పాట పాడారు. అందులో, ట్రాఫిక్ ఇబ్బందులు, వెంతెనలు కూలిపోవడం వంటి వాటి గురించి ప్రస్తావిస్తూ.. బీజేపీ నియంతృత్వ పాలన సాగిస్తుందని విమర్శించారు.

క్షమాపణలు చెప్పనన్న కామ్రా

మరోవైపు ఏక్‌నాథ్‌ షిండేపై తాను చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పనని కునాల్‌ కామ్రా ఇప్పటికే స్పష్టం చేశారు. షిండే గురించి ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ అన్న మాటలనే తాను చెప్పాననన్నారు. దాడులకు పాల్పడుతున్న వారిని చూసి భయపడనంటూ ఎక్స్‌ వేదికగా కునాల్‌ స్పందించారు. అయితే, ఈ వ్యవహారంలో నమోదైన కేసుకు సంబంధించి ఇటీవల విచారణకు హాజరుకావాలని పోలీసులు సమన్లు ఇచ్చినప్పటికీ ఆయన హాజరు కాలేదు. వారం రోజుల గడువు కావాలని కునాల్‌ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన పోలీసులు.. రెండోసారి సమన్లు జారీచేశారు.

Next Story