- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Monalisa:‘న్యూ జర్నీ స్టార్ట్’.. ఆ ఫొటో షేర్ చేసిన కుంభమేళా బ్యూటీ(వైరల్ ఫొటో)

దిశ,వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్(Uttar Pradesh)లోని ప్రయోగరాజ్(Prayag Raj)లో జరుగుతున్న మహాకుంభమేళా(Mahakumbh Mela)లో ఆకర్షించే కళ్లతో ఫేమస్(Famous) అయిన తేనేకళ్ల బ్యూటీ మోనాలిసా(Monalisa) గురించి తెలిసిందే. ప్రయోగరాజ్‌లో జరుగుతోన్న మహాకుంభమేళాకు మధ్యప్రదేశ్(Madya Pradesh)లోని ఇండోర్(Indore)కి చెందిన మోనాలిసా తన కుటుంబంతో కలిసి పూసల దండలు, రుద్రాక్షలు అమ్ముకోవడానికి వచ్చి.. కుంభమేళాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.
అందమైన చిరునవ్వు, తేనె కళ్లతో ఆకట్టుకున్న మోనాలిసా అందానికి నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆమె ఫొటోలు తీసి సోషల్ మీడియా(Social Media)లో పోస్ట్ చేయగా నెట్టింట ఓ రేంజ్‌లో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో పెద్ద ఎత్తున జనాలు ఆమె వెంటపడ్డారు. ఇదిలా ఉంటే.. మోనాలిసాకు సంబంధించి రోజుకో వార్త నెట్టింట వైరల్‌గా మారుతోంది.
ఈ తరుణంలో మహాకుంభమేళాలో పూసలు అమ్ముతూ తన ఎట్రాక్టింగ్ కళ్లతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిన మోనాలిసా సినిమాల్లో ఎంట్రీకి సిద్ధమైంది. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మెరిసే కళ్లు, పూస దండలు, ముక్కు పుడక, లైట్ గ్రీన్ చుడీదార్‌లో ఆమె చాలా బ్యూటీఫుల్‌గా కనిపిస్తోంది. ‘‘తన కొత్త జర్నీ ప్రారంభమైందని, తనను ఇక్కడి వరకు తీసుకొచ్చిన అందరికీ ధన్యవాదాలు’’ అంటూ ఆమె ఆ ఫొటోకు క్యాప్షన్ ఇచ్చింది. ప్రజెంట్ నెట్టింట మోనాలిసా న్యూ లుక్ ఫొటో వైరల్‌గా మారింది.