- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుంభమేళా బ్యూటీ మోనాలిసా మిస్సింగ్.. ఫర్మాన్ ఖాన్ సెల్ఫీ వీడియో, కేరళలో రాజకీయ దుమారం!
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పూసలమ్ముకుంటూ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ‘కుంభమేళా బ్యూటీ’ మోనాలిసా భోస్లే అదృశ్యమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో పూసలమ్ముకుంటూ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారిన ‘కుంభమేళా బ్యూటీ’ మోనాలిసా భోస్లే అదృశ్యమైంది. రాజస్తాన్‌లోని అజ్మీర్‌కు వెళ్లినప్పటి నుంచి ఆమె కనిపించడం లేదని, భర్త ఫర్మాన్ ఖాన్ తాజాగా ఓ సెల్ఫీ వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. మోనాలిసా పారిపోయిందని, అజ్మీర్‌లో తనను వెతుకుతున్నట్లు చెబుతాడు. మరోవైపు, మోనాలిసా మైనర్ అని జాతీయ ఎస్టీ కమిషన్ (NCST) తేల్చడంతో ఫర్మాన్‌పై మధ్యప్రదేశ్‌లో పోక్సో (POCSO) కేసు నమోదు కావడం, ఇది కేరళ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపడం సంచలనంగా మారింది.
సీపీఐ(ఎం) నేతల సమక్షంలో వివాహం
కుంభమేళాలో ఫేమస్ అయిన తర్వాత సనోజ్ మిశ్రా సహకారంతో మోనాలిసా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఓ తెలుగు సినిమాకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆమె, పలు నగరాల్లో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ కూడా చేసింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు తమ ప్రేమ పెళ్లికి అంగీకరించడం లేదంటూ ప్రియుడు ఫర్మాన్ ఖాన్‌తో కలిసి కేరళ పోలీసులను ఆశ్రయించింది. అనంతరం మార్చి 11న కేరళలోని అరుణ్మనూర్ శ్రీ నారాయణ గురు ఆలయంలో సీపీఐ(ఎం) నేతల సమక్షంలో వివాహం చేసుకుంది. పెళ్లి సమయంలో ఆమె వయసుపై వివాదం రాగా.. తనకు 18 ఏళ్లు నిండాయని ఓ ఐడీ కార్డును ప్రెస్‌మీట్‌లో చూపించారు.
వెలుగులోకి అసలు నిజం.. భర్తపై కేసు
తాజాగా జాతీయ ఎస్టీ కమిషన్ (NCST) జరిపిన విచారణలో అసలు నిజాలు వెలుగుచూశాయి. మధ్యప్రదేశ్‌లోని ఆస్పత్రి రికార్డుల ప్రకారం మోనాలిసా పుట్టిన తేదీ డిసెంబర్ 2009 అని, వివాహం నాటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లేనని నిర్ధారణ అయింది. దీంతో మధ్యప్రదేశ్‌లోని మహేశ్వర్ పోలీస్ స్టేషన్‌లో భర్త ఫర్మాన్ ఖాన్‌పై ‘పోక్సో’ చట్టం కింద కేసు నమోదైంది. ఈ కేసు నమోదైన వెంటనే మోనాలిసా అదృశ్యం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది.
కేరళలో రాజకీయ రగడ..
మైనర్ బాలిక వివాహానికి మద్దతు తెలిపారంటూ కేరళలోని అధికార సీపీఐ(ఎం) నేతలపై బీజేపీ తీవ్ర విమర్శలు చేస్తోంది. పెళ్లికి హాజరైన మంత్రి వి.శివన్‌కుట్టి, ఎంపీ ఏఏ రహీమ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్‌లపై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎస్. సురేష్ డిమాండ్ చేశారు. నకిలీ వయసు ధ్రువీకరణ పత్రాలు సృష్టించి పెళ్లి చేయడం మంత్రుల పనా? అని ఆయన ప్రశ్నించారు. అయితే, పెళ్లిని తాము ఆర్గనైజ్ చేయలేదని, ఆ వేడుక జరుగుతోందని తెలిసి మాత్రమే హాజరయ్యామని సీపీఐ(ఎం) నేతలు వివరణ ఇచ్చుకుంటున్నారు.






