- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kumbh Mela: మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు.. పెరిగిన రద్దీ
ప్రపంచంలోనే అత్యంత అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. బల్సాన్, బైర్హానా, సోబ్టియాబాగ్, దర్భంగా సమీపంలో భారీగా రద్దీ పెరిగింది.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రపంచంలోనే అత్యంత అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాకు భక్తులు పోటెత్తుతున్నారు. బల్సాన్, బైర్హానా, సోబ్టియాబాగ్, దర్భంగా సమీపంలో భారీగా రద్దీ పెరిగింది. 15 నిమిషాల ప్రయాణానికి దాదాపు 3 గంటలు పడుతోందన్నారు. మహా కుంభమేళా కోసం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సహా పొరుగున్న సిటీ వారాంతంలో భారీ ట్రాఫిక్ జాం అయ్యింది. వేలాది వాహనాలు ప్రయాగ్ రాజ్ వైపునకు కదులుతున్నాయి. ప్రయాగ్‌రాజ్ సరిహద్దులో ఉన్న మధ్యప్రదేశ్‌లోని రేవాలో మహా కుంభమేళాకు వెళ్లే వాహనాల సంఖ్య కూడా గత 24 గంటల్లో భారీగా పెరిగింది. గతవారం, మహా కుంభమేళాకు వెళ్లే వేలాది మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే మార్గాల్లో వందల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జాం అయ్యింది. దాదాపు 300 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిపోయినట్లు నివేదికలు సూచించాయి.
50 కోట్లు దాటిన భక్తులు
మహా కుంభమేళా ప్రారంభానికి ముందు యాత్రికుల సంఖ్య 40 కోట్ల నుండి 45 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది. అయితే, అనుకున్నదాని కంటే ఎక్కువగా భక్తులు కుంభమేళాను సందర్శించారు. ఇప్పటివరకు, మహాకుంభమేళాలో దాదాపు 50 కోట్లకు పైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26 వరకు కొనసాగుతుంది. "యునైటెడ్ స్టేట్స్, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ వంటి దేశాలన్నీ సనాతన ధర్మ పవిత్ర జలాల్లో మునిగిపోయిన వారి కంటే తక్కువ జనాభాను కలిగి ఉన్నాయి" అని యూపీ సర్కారు ప్రకటనలో తెలిపింది. "భారతదేశ ఆధ్యాత్మికత, ఐక్యత, సమానత్వం, సామరస్యానికి సజీవ చిహ్నం" అని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు.






