- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బిగ్ బ్రేకింగ్.. నేపాల్ ప్రధాని రాజీనామా
నేపాల్ ప్రధాని (Nepal PM) కేపీ ఓలి.. తన పదవికి (KP Oli Resign) రాజీనామా చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: నేపాల్ ప్రధాని (Nepal PM) కేపీ ఓలి.. తన పదవికి (KP Oli Resign) రాజీనామా చేశారు. దేశ సైన్యం సూచన మేరకు ఆయన పదవి నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాపై నిషేధం, అవినీతి ఆరోపణలతో మొదలైన నిరసనలు నిన్నటి నుంచి మరింత హిసాత్మకంగా మారాయి. పార్లమెంట్ ముట్టడితో సైన్యం రంగంలోకి దిగి కాల్పులు జరపగా 20 మంది మరణించారు. వందలాది మందికి గాయాలయ్యాయి. దీంతో ప్రధాని కేపీ ఓలి ఇందుకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేశారు. సోషల్ మీడియాపై నిషేధాన్ని ఎత్తివేయడంతో పాటు.. హోంమంత్రి రాజీనామా చేసినా ప్రజల నిరసనలు ఆగకపోవడంతో.. ప్రధాని రాజీనామా చేయడమే అనివార్యంగా మారినట్లు సమాచారం.
కాగా.. పదవికి రాజీనామా చేసిన వెంటనే కేపీ ఓలిని ఆర్మీ రహస్య ప్రాంతానికి తరలించింది. సాయంత్రం నేపాల్ కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రధాని రేసులో ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.






