Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 24 గంటల్లోనే ఇద్దరు విద్యార్థుల సూసైడ్

by B.Srinivas |

కోచింగ్ హబ్‌గా పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటా నగరంలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది.

Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 24 గంటల్లోనే ఇద్దరు విద్యార్థుల సూసైడ్
X

దిశ, నేషనల్ బ్యూరో: కోచింగ్ హబ్‌గా (Coaching hub) పేరుగాంచిన రాజస్థాన్‌లోని కోటా (Kota) నగరంలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటికే నలుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా తాజాగా 24 గంటల్లోనే మరో ఇద్దరు స్టూడెంట్స్ సూసైడ్ చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అసోంకు చెందిన పరాగ్ (18) అనే విద్యార్థి కోటాలోని మహవీర్ నగర్ (Mahaveer nagar) ప్రాంతంలో ఉంటూ జేఈఈకి ప్రిపేర్ అవుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం తను నివాసముండే ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన అఫ్షా షేక్ (23) అనే విద్యార్థిని తన హాస్టల్ గదిలో ఉరేసుకుని సూసైడ్ చేసుకుంది. ఘటనా స్థలాలకు చేరుకున్న పోలీసులు విద్యార్థుల మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. వారి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య 6కు చేరింది.

Next Story