- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kota: కోటాలో మరో విద్యార్థి సూసైడ్.. ఈ ఏడాది పదో ఘటన
రాజస్థాన్‌లోని కోటా నగరంలో మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

దిశ, నేషనల్ బ్యూరో: రాజస్థాన్ (Rajasthan)లోని కోటా (Kota) నగరంలో మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నారు. ఏప్రిల్ 2న జేఈఈ (JEE) మెయిన్ పరీక్షకు హాజరుకావాల్సిన విద్యార్థి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాన్పూర్‌కు చెందిన ఉజ్వల్ మిశ్రా (18) అనే విద్యార్థి కోటాలోని రాజీవ్ నగర్ ప్రాంతంలో ఉంటూ జేఈఈకి ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం తన హాస్టల్ గది నుంచి బయలుదేరి కోటా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. ఓ రైలు రావడాన్ని గమనించిన మిశ్రా పట్టాలపై పడుకుని సూసైడ్ చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఉజ్వల్ తండ్రి దీపక్ మిశ్రా (Deepak Mishra) వ్యవసాయ శాస్త్రవేత్త కావడం గమనార్హం. తన కుమారుడు గత రెండేళ్లుగా కోటా ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నాడని తెలిపారు.
ఆత్మహత్యకు ముందు ఉజ్వల్ తన స్నేహితుడితో మాట్లాడినట్టు తెలుస్తోంది. జేఈఈ మెయిన్ పరీక్షలో తాను ఉత్తీర్ణత సాధించలేనేమోనని ఆందోళన వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో ఈ ఏడాది ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య పదికి చేరుకుంది. మార్చి 25న బిహార్‌కు చెందిన 17 ఏళ్ల వైద్య విద్యార్థి హర్షరాజ్ శంకర్ తన హాస్టల్ గదిలో ఉరేసుకున్నాడు. అంతకుమందు కేవలం జనవరిలోనే ఆరుగు విద్యార్థులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మరోవైపు విద్యార్థుల ఆత్మహత్యలను నివారించడానికి స్థానిక పాలనా యంత్రాంగం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ విద్యార్థుల ఆత్మహత్యలు జరగడం ఆందోళన కలిగిస్తోంది.






