- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kolkata: కోల్‌కతా గ్యాంగ్ రేప్ కేసులో నాలుగో అరెస్టు
సహాయం కోసం ఆమె పదే పదే వేడుకున్నప్పటికీ, గార్డు ఆమెకు సహాయం చేయలేదని పోలీసులు తెలిపారు

దిశ, నేషనల్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ లా కాలేజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై జరిగిన అత్యాచారం కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. శనివారం ఆ కాలేజీ సెక్యూరిటీ గార్డు పినాకీ బెనర్జీని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ నేత సహా ముగ్గురు వ్యక్తుల అరెస్టుల తర్వాత ఇది నాల్గవ అరెస్టు. ప్రధాన నిందితుడిగా తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగంలోని కీలక వ్యక్తి కావడంతో ఈ ఘటన రాజకీయ విమర్శలకు కేంద్రమైంది. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. సామూహిక అత్యాచారం జరిగిన సమయంలో సెక్యూరిటీ గార్డు పినాకి బెనర్జీ అక్కడే ఉన్నాడని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. నిందితుడి సూచనల మేరకు, అతను తన గార్డు గదిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. సహాయం కోసం ఆమె పదే పదే వేడుకున్నప్పటికీ, గార్డు ఆమెకు సహాయం చేయలేదని పోలీసులు తెలిపారు. జరిగిన ఘటన గురించి కాలేజీ యాజమాన్యం లేదా పోలీసులకు తెలియజేయడం అతని బాధ్యత. కానీ అతను అలా చేయలేదు. విచారణ సమయంలో అతని వ్యవహరించిన నిర్లక్ష్యం బయటపడింది, ఆ తర్వాతే అతన్ని అరెస్టు చేసినట్టు పోలీసులు వివరించారు. కాలేజీ ప్రధాన గేటుకు తాళం వేసిన తర్వాత సెక్యూరిటీ గార్డును గది బయట కూర్చోబెట్టారని బాధిత మహిళ ఆరోపించింది. సంఘటన సమయంలో సెక్యూరిటీ గార్డు అక్కడే ఉన్నప్పటికీ జోక్యం చేసుకోలేదని కూడా ఆమె పేర్కొంది.
జూన్ 25న విద్యార్థినిపై సెక్యూరిటీ గార్డు రూమ్‌లోనే కీలక నిందితుడు, కాలేజీ తృణమూల్ కాంగ్రెస్ ఛత్ర పరిషత్ యూనిట్ మాజీ అధ్యక్షుడు, టీఎంసీ విద్యార్థి సంఘం దక్షిణ కోల్‌కతా విభాగానికి సంస్థాగత కార్యదర్శి అయిన మనోజిత్ మిశ్రా అత్యాచారానికి పాల్పడ్డాడు. మరో ఇద్దరు, ప్రస్తుత విద్యార్థులు పక్కనే ఉండి నేరానికి సహకరించారు. ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ప్రధాన నిందితుడు మనోజిత్ మిశ్రాను బుధవారం అరెస్టు చేయగా, సహ నిందితుడు మొదటి సంవత్సరం విద్యార్థి జైబ్ అహ్మద్ (19), రెండవ సంవత్సరం విద్యార్థి ప్రమిత్ ముఖర్జీ(20)ని గురువారం అరెస్టు చేశారు.






