- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెస్సీకి కోల్‌కతా CM మమతా బెనర్జీ క్షమాపణ
మెస్సీకి కోల్‌కతా CM మమతా బెనర్జీ క్షమాపణ

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ ఫుల్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ కోల్‌కతా పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మెస్సీ మ్యాచ్ ఆడకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు మైదాన్ని గుళ్ల చేశారు. కుర్చీలు విసిరారు.. ప్లెక్సీలు చించారు. బారికేడ్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఫ్యాన్స్ గొడవ చేయడంతో సొరంగం ద్వారా మెస్సీ బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఈ ఘటనపై కోల్‌కతా సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ సందర్భంగా మెస్సీకి క్షమాపణ చెప్పారు. మరోవైపు.. మెస్సీ పర్యటన ఏర్పాట్లపై కోల్‌కతా గవర్నర్ సీరియస్ అయ్యారు. బెంగాల్ ప్రభుత్వాన్ని నివేదిక కోరారు.
మెస్సీ మ్యాచ్ ఆడుతారని.. ఆ మ్యాచ్‌ను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ తరలి వచ్చారు. కాగా, స్టేడియంకు వచ్చిన మెస్సీ కొద్ది క్షణాల్లోనే వెళ్లిపోయారు. దీంతో.. స్టేడియంలో వేచి చూస్తున్న ప్రేక్షకులు ఆగ్రహానికి గురయ్యారు. గ్రౌండ్‌ను చెల్లాచెదురు చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు.






