- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Mock Drill: మాక్ డ్రిల్ ఎందుకంటే?.. కేంద్రం చెప్పిన 9 లక్ష్యాల గురించి తెలుసా?
తొమ్మిది లక్ష్యాల కోసం ఈ సెక్యూరిటీ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ పేర్కొంది. వైమానిక దాడి సమయంలో ఉపయోగించే ఎయిర్ రెయిడ్ వార్నింగ్ సిస్టమ్ పనితీరును సమీక్షించడం ఇందులో కీలకమైంది.

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఘటన తర్వాత దాయాది దేశంతో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా నేడు మెగా మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ, సైనికపరమైన ఘటనలు చోటుచేసుకున్నా.. వాటిని ఎదుర్కోవడానికి పౌరులూ సన్నద్ధంగా ఉండాలనే ఉద్దేశ్యంతో దేశవ్యాప్తంగా 244 సివిల్ డిఫెన్స్ జిల్లాల్లో ఆపరేషన్ అభ్యాస్ పేరిట దీన్ని చేపడుతున్నారు. మొత్తంగా 259 లొకేషన్లలో ఈ ఎక్సర్‌సైజులు ఉంటాయి. పౌరులనూ యుద్ధ వాతావరణాన్ని ఎదుర్కొనేలా సిద్ధం చేయాలనే లక్ష్యంతో సోమవారం కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసింది. మంగళవారం హోం శాఖ కార్యదర్శి ఈ కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు, సమన్వయంపై రాష్ట్రాల సీఎస్‌లతో వీడియో కాన్ఫరెన్సింగ్ నిర్వహించారు. ప్రధాన కార్యదర్శులతోపాటు ఎన్‌డీఆర్ఎఫ్, సివిల్ డిఫెన్స్ డీజీలూ ఈ సమావేశంలో పాల్గొని వివరాలు అందించారు. మాక్ డ్రిల్‌లో ప్రధానంగా 2010లో గుర్తించిన సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్‌లపై ఫోకస్ ఉంటుంది. రక్షణ ఫెసిలిటీలు, ఆర్థిక, ప్రజా మౌలిక సదుపాయాలు ఎక్కువున్న ప్రాంతాలను సివిల్ డిఫెన్స్ జిల్లాలుగా గుర్తించారు. భారత్‌లో చివరిసారిగా 1971లో ఇలా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ చేపట్టారు. ఆ సంవత్సరంలో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్‌ను భారత్ ఓడించగా.. బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా అవతరించింది. అదే 1999లో జరిగిన కార్గిల్ యుద్ధ సమయంలో డ్రిల్స్ చేపట్టలేదు.
మాక్ డ్రిల్స్ ఉద్దేశాలు..
తొమ్మిది లక్ష్యాల కోసం ఈ సెక్యూరిటీ డ్రిల్స్ నిర్వహిస్తున్నట్టు కేంద్ర హోం శాఖ పేర్కొంది. వైమానిక దాడి సమయంలో ఉపయోగించే ఎయిర్ రెయిడ్ వార్నింగ్ సిస్టమ్ పనితీరును సమీక్షించడం ఇందులో కీలకమైంది. ఎయిర్‌ఫోర్స్‌తో హాట్‌లైన్, రేడియో కమ్యూనికేషన్ లైన్ల అనుసంధానాన్ని పరిశీలిస్తారు. కంట్రోల్ రూమ్‌లు, షాడో కంట్రోల్ రూమ్‌ల పనితీరులనూ సమీక్షిస్తారు. అలాగే.. పౌరులు, విద్యార్థులూ యుద్ధ సమయాల్లో ఎలా తమను తాము కాపాడుకునేలా శిక్షణ ఇవ్వాలనీ నోటిఫికేషన్‌లో కేంద్రం పేర్కొంది. ఈ శిక్షణలో భాగంగా బ్లాక్‌ఔట్, ముఖ్యమైన ప్లాంట్లను కాపాడుకోవడం, రెస్కూ టీంలు, ఫైర్ ఫైటర్ల వేగాన్ని సమీక్షించడం, సహాయక చర్యలు, ప్రమాద స్థలి నుంచి పౌరులను తరలించే ప్రక్రియలనూ ఈ డ్రిల్‌లో ఎవల్యూయేట్ చేస్తారు. పౌరులకూ ప్రథమ చికిత్స, అగ్ని నుంచి కాపాడుకోవడం, తాత్కాలికంగా ఆశ్రయాన్ని పొందే టెక్నిక్‌లను నేర్పించడంలో ఈ మాక్ డ్రిల్ లక్ష్యాలుగా ఉన్నాయి.






