- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్రోల్ ధరలు పెంచింది 3 శాతమే..టెన్షన్ వద్దు !
పెట్రోల్ ధరలు పెంచింది 3 శాతమే..టెన్షన్ వద్దు అంటూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశారు.

దిశ, వెబ్ డెస్క్: దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ కేంద్ర సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. ముందుగా ఇంధనం వాడకం తక్కువ చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసి.. ఆ తర్వాత 4 రోజుల గ్యాప్ లో ధరలను పెంచారు. అయితే దీనిపై దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇలాంటి క్రమంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
మేం తక్కువే పెంచాం - కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు
పెట్రోల్, డీజిల్ ధరల పెంపును కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు సమర్ధించుకుంటూ మాట్లాడారు. ప్రభుత్వం పరిమితంగా రేట్లు పెంచిందని చెప్పే ప్రయత్నం చేశారు. చాలా దేశాలు పెట్రోల్, డీజిల్ ధరలను 20 నుంచి 100% వరకు పెంచాయని వెల్లడించారు. కానీ ఇండియాలో మాత్రం పెట్రోల్ పై 3.2%, డీజిల్ పై 3.4% మాత్రమే పెంచామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ఆయిల్ కంపెనీలు వారాల తరబడి నష్టాలను భరించాయని తెలిపారు. ఇది బాధ్యతాయుతమైన పాలన అంటూ వ్యాఖ్యానించారు. కాగా పెట్రోల్ పై రూ.3.42 పైసలు, డీజిల్ పై రూ.3.26 పైసలు పెంచారు.






