- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విమానం వాష్‌రూమ్ స్పీకర్‌లో కిలోల కొద్దీ బంగారం.. రూ.4.26 కోట్ల పసిడి పట్టివేత
గుజరాత్‌లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ (SVPI) అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం భారీగా బంగారం పట్టుబడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: గుజరాత్‌లోని అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ (SVPI) అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం భారీగా బంగారం పట్టుబడింది. విమానం వాష్‌రూమ్‌లోని స్పీకర్‌లో అత్యంత చాకచక్యంగా దాచి అక్రమ రవాణా చేస్తున్న రూ.4.26 కోట్లకు పైగా విలువైన పసిడిని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. దుబాయ్ నుంచి అహ్మదాబాద్ చేరుకున్న ఇండిగో విమానంలో (నెం. 6E-1478) కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. విమానం ముందు భాగంలోని వాష్‌రూమ్‌లో (లావెటరీ) ఉన్న స్పీకర్ బాక్స్‌లో నల్లటి ప్లాస్టిక్ టేపుతో చుట్టిన రెండు ప్యాకెట్లను గుర్తించారు. విమాన ఇంజనీర్ల సాయంతో వాటిని తెరిచి చూడగా.. అందులో 999.0 స్వచ్ఛత కలిగిన 24 క్యారెట్ల విదేశీ బంగారు బిస్కెట్లు 24 బయటపడ్డాయి.
కస్టమ్స్ కళ్లుగప్పి ఇండియాకు స్మగ్లింగ్
స్వాధీనం చేసుకున్న ఈ బంగారం మొత్తం బరువు 2,799.3 గ్రాములు (దాదాపు 2.8 కిలోలు) కాగా, మార్కెట్లో దీని విలువ రూ. 4,26,89,325 ఉంటుందని అధికారులు వెల్లడించారు. కస్టమ్స్ కళ్లుగప్పి ఇండియాకు స్మగ్లింగ్ చేసే ఉద్దేశంతోనే గుర్తు తెలియని వ్యక్తులు ఈ బంగారాన్ని దాచినట్లు అధికారులు నిర్ధారించారు. పట్టుబడిన ఈ బంగారానికి యజమానులు ఎవరూ ముందుకు రాకపోవడంతో, కస్టమ్స్ చట్టం-1962 నిబంధనల ప్రకారం దానిని ‘అన్‌క్లెయిమ్డ్’ కింద సీజ్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.






