Karge: వికసిత్ భారత్‌తో ప్రజల జేబులు ఖాళీ.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

by B.Srinivas |

దేశంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు.

Karge: వికసిత్ భారత్‌తో ప్రజల జేబులు ఖాళీ.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun karge) తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని మోడీ (Pm modi) నిరంతరం మాట్లాడుతున్న వికసిత్ భారత్‌ (Viksit Bharat) దార్శనికతతో దేశంలోని సాధారణ ప్రజల జేబులు ఖాళీ అవుతున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ఎంపిక చేసిన కొద్ది మంది బిలియనీర్ల ఖజానాలు మాత్రమే నిండుతున్నాయని విమర్శించారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా ప్రభుత్వంపై మండిపడ్డారు. భారతదేశంలోని 50 శాతం మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు గత దశాబ్దంలో జీతాల పెరుగుదలను చూడలేదని తెలిపారు. నిరుద్యోగంతో యువత అల్లాడుతున్నారని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వం ఈ సమస్యలన్నింటినీ పక్కదారి పట్టిస్తోందని తెలిపారు.

‘దేశంలో 100 కోట్ల మంది భారతీయులకు ఖర్చు చేయడానికి అదనపు ఆదాయం లేదు. దేశ జీడీపీలో 60 శాతం వినియోగంపై ఆధారపడి ఉంది. కానీ భారత్‌లో కేవలం 10 శాతం మంది ప్రజలు మాత్రమే ఆర్థిక వృద్ధి, వినియోగాన్ని నడిపిస్తున్నారు. 90 శాతం మంది ప్రజలు ప్రాథమిక రోజువారీ అవసరాలను తీర్చలేకపోతున్నారు’ అని పేర్కొన్నారు. భారత్ ప్రపంచ సుంకాల యుద్ధం, వాణిజ్య అడ్డంకులను చూస్తోందని, ఈ టైంలో కేంద్ర బడ్జెట్ ప్రకటనలు ప్రజలను పూర్తిగా నిరాశపర్చాయన్నారు.

Next Story