- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kharge: మోడీ మణిపూర్‌ను మర్చిపోయారు.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గే విమర్శలు
ప్రధాని మోడీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Malli karjun kharge) తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ మండిపోతున్నా మోడీ ఇప్పటివరకు ఆ రాష్ట్రాన్ని సందర్శించలేదని ఫైర్ అయ్యారు. 42 దేశాలు తిరిగారు కానీ మణిపూర్‌కు మాత్రం వెళ్లలేదని తెలిపారు. అక్కడికి వెళ్లాలంటే మోడీ భయపడుతున్నారా? అని ప్రశ్నించారు. కర్ణాటకలోని మైసూరులో శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లను రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నిస్తున్నాయని కానీ దేశ ప్రజలు దానిని అనుమతించబోరని తెలిపారు. కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇస్తుందని, అభివృద్ధిని కేంద్రంగా పని చేస్తుందని కొనియాడారు. కర్ణాటక ప్రభుత్వం దివాళా తీసిందని బీజేపీ చెబుతోందని, కానీ ఇది పూర్తిగా తప్పుడు వాదన అని తెలిపారు. సిద్ధరామయ్య ప్రభుత్వం రాష్ట్రాన్ని మెరుగైన దిశలో తీసుకెళ్తోందని స్పష్టం చేశారు.






