- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kharge: ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించండి.. ప్రధాని మోడీకి ఖర్గే, రాహుల్ విజ్ఞప్తి
పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీకి ఖర్గే, రాహుల్ గాంధీలు విజ్ఞప్తి చేశారు

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని మోడీకి కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Malli karjun karge), లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul gandhi) లు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఇరువురు నేతలు మోడీకి తాజాగా లేఖ రాశారు. ఈ దారుణ సంఘటనపై సమిష్టిగా స్పందించడానికి ఉభయ సభల ప్రత్యేక సమావేశం నిర్వహించాలని తెలిపారు. ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశ ఐక్యతను చాటడానికి ప్రత్యేక సమావేశం వీలు కల్పిస్తుంది. ప్రస్తుత సమయంలో ఐక్యత, సంఘీభావం ఎంతో అవసరం. కాబట్టి వీలైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేయండి. ఉగ్ర దాడిని ఎదుర్కోవాలనే సమిష్టి సంకల్పానికి ఇది శక్తివంతమైన ప్రదర్శన అవుతుంది’ అని ఖర్గే పేర్కొన్నారు.
‘పహెల్గామ్ ఉగ్రదాడి ప్రతి భారతీయుడిని ఆగ్రహానికి గురి చేసింది. ఈ కీలక సమయంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా కలిసి నిలబడతామని భారత్ నిరూపించాలి. ప్రజాప్రతినిధులు తమ ఐక్యత, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించగలిగేలా పార్లమెంటు ఉభయ సభల ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపక్షం విశ్వసిస్తోంది’ రాహుల్ తన లేఖలో పేర్కొన్నారు. కాగా, ఉగ్రదాడిపై ప్రభుత్వం ఏ చర్య తీసుకున్న మద్దతిస్తామని గతంలో కాంగ్రెస్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.






