- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పదేళ్లుగా వాళ్లను కాపాడుతుంది ఈసీనే.. ఖర్గే సంచలన వ్యాఖ్యలు
ఎన్నికల కమిషన్ పై మరోసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా ఈసీ ఓటు చోరులను కాపాడుతూ వస్తుందని ఆరోపించారు. కీలకమైన సమాచారాన్ని దాచి పెట్టిందని విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్: ఎన్నికల కమిషన్ పై మరోసారి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా ఈసీ ఓటు చోరులను కాపాడుతూ వస్తుందని ఆరోపించారు. కీలకమైన సమాచారాన్ని దాచి పెట్టిందని విమర్శించారు. 2023 కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటరు జాబితా నుండి ఓట్లను తొలగించడానికి చేసిన యత్నానికి సంబంధించిన కీలమైన డేటాను ఇప్పటి వరకు కమిషన్ బయటపెట్టలేదన్నారు. 2023 ఎన్నికల ముందు అలంద్ నియోజకవర్గంలో ఓటర్లను తొలగించాలని చేసిన ప్రయత్నాలను తమ పార్టీ బయటపెట్టిందని పేర్కొన్నారు.
అప్పట్లో దీనివల్ల వేల మంది ఓటర్లు ఓటు హక్కును కోల్పోయారన్నారు. దీనికి సంబంధించిన స్పష్టమైన సాక్ష్యాలు ఉన్నప్పటికీ కీలక విషయాలను దాచిపెట్టి ఓటు చోరీ వెనక ఉన్నవారిని ఈసీ సమర్థంగా రక్షించిందని చెప్పారు. ఓటు చోరీకి పాల్పడుతున్న వారిని కాపాడడమే లక్ష్యంగా ఈసీ పదేళ్లుగా పనిచేస్తుందని తెలిపారు. దానికోసం చట్టాలను మార్చడానికి కూడా వెనకాడట్లేదన్నారు.
అప్పుడు కర్ణాటకలో చేసిన విధంగానే ప్రస్తుతం బిహార్‌లో కూడా ఓటు చోరికి పాల్పడడానికి కేంద్రం, ఈసీ కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాని ఓట్ల చోరీ ద్వారా గెలిచేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలోనే కాకుండా మహరాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఓటు చోరి చేసిందని అన్నారు. త్వరలోనే ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ కూలిపోతుందని, ఓటు చోరీకి వ్యతిరేకంగా బిహార్ లో చేపట్టిన ఓటర్ అధికార్ యాత్ర దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారుతుందని అన్నారు.






