ఒడిశా సరిహద్దుల్లో అద్భుత దృశ్యం..500 అడుగుల ఎత్తు నుంచి

by velandi.Saikiran |

ఒడిశాలోని నుపడా జిల్లా సినాపాలి బ్లాక్ పరిధిలోని ఘట్సరా పరిసరాలలో..ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు ఆనుకొని ఖరల్ధాస్ జలపాతం ఉంది.

ఒడిశా సరిహద్దుల్లో అద్భుత దృశ్యం..500 అడుగుల ఎత్తు నుంచి
X

దిశ‌, వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీలలో వర్షాలు తక్కువగా ఉన్నప్పటికీ, మిగిలిన ఎగువ రాష్ట్రాలలో మాత్రం భయంకరంగా కురుస్తున్నాయి. దీంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కేరళలో కూడా భయంకరమైన వర్షాలు పడుతున్నాయి. అయితే భారీ వర్షాలు నేపథ్యంలో ఒడిశా, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న ఖరల్ధాస్ జలపాతం అందరిని ఆకట్టుకుంటోంది. ఇటీవల కురిసిన వర్షాలతో 500 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న ఈ జలపాతం, ప్రకృతి ప్రేమికులను కనువిందు చేస్తోంది. ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక చక్కని పర్యటక ప్రాంతంగా మారుతోంది.

ఖరల్ధాస్ జలపాతం ఎక్కడ ఉందంటే ?

ఒడిశాలోని నుపడా జిల్లా సినాపాలి బ్లాక్ పరిధిలోని ఘట్సరా పరిసరాలలో..ఛత్తీస్‌గఢ్ సరిహద్దుకు ఆనుకొని ఖరల్ధాస్ జలపాతం ఉంది. దట్టమైన అడవులు, కొండల మధ్య సుమారు 500 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందికి జాలు వారుతోంది. వర్షాకాలం, చలికాలం ప్రారంభంలో అంటే జులై నుంచి డిసెంబర్ వరకు ఈ జలపాతం పూర్తిస్థాయిలో ప్రవహిస్తుందని అధికారులు చెబుతున్నారు.

Next Story