- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Khamenei: యూఎస్ ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదు.. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కీలక వ్యాఖ్యలు
ఇస్లామిక్ రిపబ్లిక్‌ను లొంగదీసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ అన్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇస్లామిక్ రిపబ్లిక్‌ను లొంగదీసుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ (Ayatollah Khamenei) అన్నారు. దీనిని ఎదుర్కోవడానికి యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ అవసరమని పిలుపునిచ్చారు. రాజధాని టెహ్రాన్‌లోని ఒక మసీదులో తాజాగా ఖమేనీ ప్రసంగించారు. ఇటీవల తమపై ఇజ్రాయెల్, యూఎస్‌లు చేసిన దాడి కీలకమైన అణు కేంద్రాలే లక్ష్యంగా జరిగాయన్నారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌ను అస్థిరపరచడానికే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. అమెరికా ఎల్లప్పుడూ దానికి విధేయుడిగా మార్చుకునేందుకే ప్రయత్నిస్తుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒత్తిడికి ఇరాన్ తలొగ్గదని స్పష్టం చేశారు. సాయుధ దళాలు, ప్రభుత్వం దృఢంగా నిలబడటం ద్వారా ఇరాన్ తన శత్రువులకు దీటైన సమాధానం ఇచ్చిందని తెలిపారు. ఘర్షణ టైంలో ఇరాన్ చూపిన ధైర్యాన్ని ప్రపంచం మొత్తం చూసిందన్నారు. అనేక దేశాల్లో ఇరాన్ పట్ల గౌరవం పెరిగిందని చెప్పారు. కాగా, ఇరాన్ మంగళవారం బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలతో అణు చర్చల కోసం సమావేశం కానుంది. ఈ నేపథ్యంలోనే ఖమేనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.






