- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎట్టకేలకు బహిరంగంగా కనిపించిన ఖమేనీ.. జూన్ 24 తర్వాత తొలిసారి ప్రత్యేక్షం
ఇరాన్, ఇజ్రాయోల మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నప్పటి నుంచి ఇరాన్ సుప్రీ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కనిపించటంలేదనే విషయం తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్:ఇరాన్ (Iran), ఇజ్రాయోల్ (Isreal) మధ్య ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నప్పటి నుంచి ఇరాన్ సుప్రీ లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ (Ayatollah Ali Khamenei) కనిపించటంలేదనే విషయం తెలిసిందే. ఆయన జాడ తెలుపుమని ఇరాన్ ప్రజలు కూడా తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశారు. అయితే, ఎట్టకేలకు ఖమేనీ అజ్ఞాతం వీడి బాహ్య ప్రపంచానికి దర్శనమిచ్చారు. రాజధాని టెహ్రాన్‌లో జరిగిన మతపరమైన ముఖ్య కార్యక్రమంలో పాల్గొంటూ కనిపించారు.
షియా ముస్లింలకు ఎంతో ప్రాధాన్యత ఉన్న అషురా(మొహర్రం) సందర్భంగా జరిగిన ఈ వేడుకలో ఖమేనీ సాంప్రదాయ నల్లని వస్త్రాల్లో హాజరై ప్రజలను పలకరించారు.ప్రతి సంవత్సరం ఖమేనీ అషురా కార్యక్రమాల్లో తప్పనిసరిగా పాల్గొంటారు. ఈ ఏడాది మాత్రం ప్రత్యేకంగా నిలిచింది, ఎందుకంటే ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధం అనంతరం ఆయన తొలిసారి బహిరంగంగా ప్రత్యక్షమయ్యారు. ఆయనను చూసి హాజరైన ప్రజలు పెద్దపెద్ద నినాదాలు చేస్తూ హర్షం వ్యక్తం చేశారు.
కాగా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య 12 రోజులపాటు సాగిన యుద్ధం జూన్ 24న కాల్పుల విరమణ ఒప్పందంతో ముగిసింది. అయితే యుద్ధం ముగిసిన తరువాత కూడా ఖమేనీ బహిరంగంగా కనిపించకపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇజ్రాయెల్ దాడుల తీవ్రత దృష్ట్యా ఖమేనీ తన కుటుంబంతో కలిసి బహుళ భద్రత కలిగిన బంకర్‌లో తలదాచుకున్నట్లు అంతర్జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి.






