Khalistani: కెనడాలో ఖలిస్థానీల దుశ్చర్య.. వాంకోవర్‌లో గురుద్వారా ధ్వంసం

by B.Srinivas |

ఖలిస్థానీలు మరోసారి దుశ్చర్యలకు పాల్పడ్డారు. కెనడాలోని వాంకోవర్‌లో ఉన్న చరిత్రాత్మక గురుద్వారాను ధ్వంసం చేశారు.

Khalistani: కెనడాలో ఖలిస్థానీల దుశ్చర్య.. వాంకోవర్‌లో గురుద్వారా ధ్వంసం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఖలిస్థానీ (Kalisthanis)లు మరోసారి దుశ్చర్యలకు పాల్పడ్డారు. కెనడాలోని వాంకోవర్‌లో ఉన్న చరిత్రాత్మక గురుద్వారా (Gurudwara)ను ధ్వంసం చేశారు. అంతేగాక దాని గోడలపై ఖలిస్థాన్ జిందాబాద్ నినాదాలతో పాటు భారత వ్యతిరేక రాతలు రాశారు. ఆదివారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఈ చర్యలకు సిక్కు వేర్పాటువాదుల గుంపే కారణమని గురుద్వారాను నిర్వహిస్తున్న ఖల్సా దివాన్ సొసైటీ నిర్వాహకులు ఆరోపించారు. గోడలపై అనేక చోట్ల ఖలిస్తాన్ జిందాబాద్, భారత వ్యతిరేక నినాదాలు పెయింట్‌తో స్ప్రే చేసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఖలిస్థానీ వేర్పాటు వాదులే దీనికి కారణమని స్పష్టం చేశారు.

కెనడియన్ సిక్కు సమాజంలో భయాన్ని కలిగించేందుకే ఈ తరహా ఘటనలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఐక్యత, స్థితిస్థాపకతను సూచించే ఖల్సా సజ్నా దివస్‌ను జరుపుకోవడానికి సమావేశమైన నేపథ్యంలోనే ఈ ఘటన జరగడం బాధాకరమని పేర్కొన్నారు. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు ట్రక్కుపై వచ్చి గురుద్వారా గేటు, బయటి గోడలపై నినాదాలు రాసినట్టు పలు కథనాలు వెల్లడించాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించినట్టు వాంకోవర్ పోలీసులు వెల్లడించారు.

Next Story