- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: పంజాబ్‌లో హై అలర్ట్.. రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ నెట్ సేవలు బంద్!
పంజాబ్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పంజాబ్‌లో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఖలిస్తాన్ వేర్పాటువాద నేత అమృత్ పాల్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని జలంధర్‌లో శనివారం పోలీసులు అమృత్ పాల్‌ను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఖలిస్తాన్ వేర్పాటువాదులు, అమృత్ పాల్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి తీవ్ర ఆందోళనలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన పోలీసులు రాష్ట్ర వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా.. పంజాబ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం వరకు ఇంటర్ నెట్ సేవలను నిలిపివేశారు. కాగా, ప్రత్యేక ఖలిస్తాన్ దేశ ఏర్పాటుకు ఉద్యమం చేస్తోన్న అమృత్ పాల్ సింగ్.. ఇటీవల భారత్ హోంమంత్రి అమిత్ షాను హెచ్చరించిన విషయం తెలిసిందే. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి పట్టిన గతే అమిత్ షాకు పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాకుండా ఇటీవల పంజాబ్ రాష్ట్రంలో ఓ పోలీస్ స్టేషన్‌పై అనుచరులతో కలిసి దాడి చేసి పోలీసులు అరెస్ట్ చేసిన ఖలిస్తాన్ వేర్పాటువాదులను స్టేషన్ నుండి బయటకు తీసుకువచ్చాడు.






