Khalistan: కెనడాలో మరోసారి రెచ్చిపోయిన ఖలిస్థానీలు.. సర్రేలోని హిందూ ఆలయం ధ్వంసం

by B.Srinivas |

కెనడాలో ఖలిస్థాన్ వేర్పాటు వాదులు మరోసారి దుశ్చర్యలకు పాల్పడ్డారు. హిందూ ఆలయాన్ని ధ్వంసం చేశారు.

Khalistan: కెనడాలో మరోసారి రెచ్చిపోయిన ఖలిస్థానీలు.. సర్రేలోని హిందూ ఆలయం ధ్వంసం
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడాలో ఖలిస్థాన్ (Khalisthan) వేర్పాటు వాదులు మరోసారి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఇటీవలే ఓ గురుద్వారాను ధ్వంసం చేసిన ఖలిస్థానీలు ఆ ఘటన మరువక ముందే మరో హిందూ ఆలయాన్ని టార్గెట్ చేశారు. సర్రేలోని శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయాన్ని ధ్వంసం చేశారు. టెంపుల్ గోడలపై ఖలిస్థానీ అనుకూల నినాదాలు రాయడంతో పాటు దేవాలయంలోని ప్రవేశ ద్వారంతో సహా పలు వస్తువులను ధ్వంసం చేశారు. ఈ ఘటన ఏప్రిల్ 19న జరిగినట్టు ఆలయ నిర్వహికులు ఓ ప్రకటనలో తెలిపారు. ‘ఈ నెల 19 తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సర్రేలోని శ్రీ లక్ష్మీ నారాయణ మందిరాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. గోడలపై ఖలిస్థాన్ అనే పదాలు రాయడంతో పాటు ప్రవేశ ద్వారం. ఆలయ స్తంభాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాం. ఆలయంపై దాడి చేసే టైంలో నిందితులు సీసీ కెమెరాలు సైతం చోరీ చేశారు’ అని పేర్కొన్నారు. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Next Story