శ్రావణ మాసం, కన్వర్ యాత్ర సందర్భంగా.. నాన్‌వెజ్ అమ్మకం ఆపేసిన కేఎఫ్‌సీ!

by Phanindra |

శ్రావణ మాసం, కన్వర్ యాత్ర సందర్భంగా నిరసనలు జరగడంతో నాన్‌వెజ్ అమ్మకం ఆపేయాలని యూపీలోని ఒక కేఎఫ్‌సీ అవుట్‌లెట్ నిర్ణయించింది.

శ్రావణ మాసం, కన్వర్ యాత్ర సందర్భంగా.. నాన్‌వెజ్ అమ్మకం ఆపేసిన కేఎఫ్‌సీ!
X

దిశ, నేషనల్ బ్యూరో: యూపీలోని ఘజియాబాద్‌లో ఉన్న ప్రముఖ ఫుడ్ చైన్ కేఎఫ్‌సీకి చెందిన ఒక అవుట్‌లెట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. శ్రావణ మాసం, కన్వర్ యాత్ర సమయంలో నాన్‌వెజ్ అమ్మడం లేదని ప్రకటించింది. ఇటీవలే ఈ అంశంపై హిందూ రక్షా దళ్ గొడవ చేసింది. కేఎఫ్‌సీలో దూరి ఆందోళన చేసిన ఈ బృంద సభ్యులు.. బలవంతంగా షాప్ షట్టర్లు మూసేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. పవిత్రమైన శ్రావణ మాసంలో నాన్‌వెజ్ అమ్మకూడదని నిరసనకారులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో తమ షాపులో ‘ప్రస్తుతం వెజ్ మాత్రమే అందుబాటులో ఉంది’ అనే బోర్డులను పెట్టింది కేఎఫ్‌సీ ఇంద్రాపురం అవుట్‌లెట్.

Next Story