ADHAR : ఆధార్ పై కీలక అప్డేట్

by Muthe.Rajitha |

చిన్నారుల ఆధార్ బయోమెట్రిక్ వివరాల అప్‌డేట్‌పై ఉడాయ్ (UIDAI) కీలక సూచనలు జారీ చేసింది.

ADHAR : ఆధార్ పై కీలక అప్డేట్
X

దిశ, వెబ్ డెస్క్ : చిన్నారుల ఆధార్ బయోమెట్రిక్ వివరాల అప్‌డేట్‌పై ఉడాయ్ (UIDAI) కీలక సూచనలు జారీ చేసింది. ఐదేళ్ల లోపు పిల్లలకు జారీ చేసే బాల్ ఆధార్ కార్డులో వేలిముద్రలు, కంటి స్కాన్ వంటి బయోమెట్రిక్ వివరాలు సేకరించబడవు. అయితే దీనిలో కేవలం ఫోటో, పేరు, పుట్టిన తేదీ, చిరునామా వంటి వివరాలు మాత్రమే నమోదు చేస్తారు. అయితే, ఐదేళ్లు దాటిన పిల్లలకు తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్ (MBU) చేయించాలని పేర్కొంది. MBU లో వేలిముద్రలు, ఐరిస్ స్కాన్, ఫోటో నమోదు చేయబడతాయి.

5 నుంచి 7 ఏళ్లలోపు పిల్లలకు ఉచిత అప్డేట్ చేయనుండగా... ఏడేళ్లు దాటిన వారికి మాత్రం రూ. 100 రుసుముతో అప్‌డేట్ చేయించుకోవాలని తెలిపింది. ఏడేళ్లు దాటినా బయోమెట్రిక్ వివరాలు అప్‌డేట్ చేయకపోతే, ఆధార్ నంబర్ డీయాక్టివేట్ అయ్యే ప్రమాదం ఉందని UIDAI హెచ్చరించింది. బయోమెట్రిక్ అప్‌డేట్ చేసిన ఆధార్ స్కూల్ అడ్మిషన్లు, ప్రవేశ పరీక్షల రిజిస్ట్రేషన్, స్కాలర్‌షిప్‌లు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) పథకాల వంటి సేవలను సజావుగా పొందడానికి అవసరమని తెలిపింది.

Next Story