టీవీకే ప్రత్యేక జనరల్ కౌన్సిల్ సమావేశం.. కీలక తీర్మానాలు

by Malleboina Mahesh |

చెన్నైలో జరిగిన పార్టీ ప్రత్యేక జనరల్ కౌన్సిల్ సమావేశంలో తమిళగ వెట్టిరి కజగం (ట్వీక్) కీలక తీర్మానాలను ఆమోదించింది.

టీవీకే ప్రత్యేక జనరల్ కౌన్సిల్ సమావేశం.. కీలక తీర్మానాలు
X

దిశ, వెబ్ డెస్క్: ఈ రోజు చెన్నైలో తమిళగ వెట్రీ కజగం (టీవీకే) పార్టీ ప్రత్యేక జనరల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొదట కరూర్ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 41 మందికి టీవీకే పార్టీ సంతాప తీర్మానం ప్రకటించింది. అలాగే పలు కీలక తీర్మానాలను ఆమోదించింది. ఇందులో మహిళల భద్రత కోసం శాంతిభద్రతలను సక్రమంగా నిర్వహించడంలో విఫలమైనందుకు డీఎంకే ప్రభుత్వాన్ని రెండవ తీర్మానం ద్వారా ఖండించింది. శ్రీలంక నావికాదళం మత్స్యకారులను ఖండిస్తూ.. అరెస్టు చేయడాన్ని మూడవ తీర్మానం. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)లో జరిగిన అవకతవకలను నాల్గవ తీర్మానం ద్వారా ఖండించింది

అలాగే ఐదవ తీర్మానంలో డెల్టా జిల్లాల ప్రజల నుంచి సకాలంలో వరిని సేకరించడంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని విఫలమైందని విమర్శలు, 6వ తీర్మానం- రాబోయే ఈశాన్య రుతుపవనాల దృష్ట్యా, వర్షపు నీటి కోసం అన్ని డ్రైనేజీ పనులను వెంటనే మరమ్మతులు చేసి పూర్తి చేయాలని డిమాండ్. అలాగే చెన్నైతో సహా తమిళనాడులోని అన్ని ప్రాంతాలలో ముందు జాగ్రత్త చర్యలు అమలు చేయాలి. రక్షిత రామ్‌సర్ చిత్తడి నేల ప్రాంతంలో నిర్మాణ పనులు నిర్వహించడానికి ప్రైవేట్ కంపెనీకి ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని ఏడవ తీర్మానం. బహిరంగ సమావేశాలు, కార్యక్రమాలకు హాజరయ్యే అన్ని పార్టీ నాయకులతో పాటు, సాధారణ ప్రజలకు ఎటువంటి వివక్ష లేకుండా భద్రత కల్పించాలని ఎనిమిదవ తీర్మానం డిమాండ్ ద్వారా టీవీకే పార్టీ డిమాండ్ చేసింది.

Next Story