- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ.. కీలక నేత సునీతక్క లొంగుబాటు
మావోయిస్టు పార్టీ(Maoist Party)కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ(Maoist Party)కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. కీలక మహిళా నేత సునీతక్క(Maoist Sunitha) లొంగిపోయింది. ఛత్తీస్‌గఢ్ పోలీసుల ఎదుట కొంతమంది మావోయిస్టులతో కలిసి సరెండర్ అయింది. ఈ సందర్భంగా లొంగిపోయిన మావోయిస్టుల మీదున్న రివార్డులను పోలీసులు అందజేశారు. కాగా, సునీత 2022లో మావోయిస్టు పార్టీలో చేరారు. మాడ్ ప్రాంతంలో ఆరు నెలల పాటు శిక్షణ పొందారు. పార్టీలో కీలక నేతగా ఎదిగారు. అనేక దాడుల్లో కీలక పాత్ర పోషించారు. అయితే.. సునీత లొంగుబాటు ఒక ముఖ్యమైన విజయంగా అధికారులు అభివర్ణించారు. సునీతకు పునరావసంతో పాటు రివార్డులు అందజేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. నిన్ననే మావోయిస్టులు తమ ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని, గత నెలలో గడ్చిరోలి పోలీసులకు లొంగిపోయిన అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్ రావు కామ్రేడ్లకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. లొంగిపోవాలనుకున్న మావోయిస్టులు తనను సంప్రదించొచ్చు అంటూ మొబైల్ నెంబర్‌ను ఇచ్చారు. దేశంలోని మేధావులు, ప్రజాస్వామ్య ప్రేమికులు, గిరిజన శ్రేయోభిలాషులు తమ నిర్ణయాన్ని అర్థం చేసుకుని మద్దతు ఇవ్వాలని మల్లోజుల వేణుగోపాల్ రావు విజ్ఞప్తి చేశారు.






