నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. సోనియా, రాహుల్‌ను విచారించేందుకు అనుమతి కోరిన ఈడీ

by Gantepaka Srikanth |

నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ(Enforcement Directorate) అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక పరిణామం.. సోనియా, రాహుల్‌ను విచారించేందుకు అనుమతి కోరిన ఈడీ
X

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald Case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ(Enforcement Directorate) అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. యంగ్ ఇండియా కంపెనీ పేరిట అక్రమాలు జరిగాయని.. దాదాపు రూ.2 వేల కోట్ల మనీలాండరింగ్ జరిగిందంటూ ఈడీ అభియోగం మోపింది. ఈ క్రమంలోనే సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul Gandhi)లను విచారించేందుకు అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా, ఈ కేసులో ఇప్పటికే సోనియా, రాహుల్‌ సహా తదితరులపై ఈడీ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. అంతేకాదు.. యంగ్ ఇండియన్ సంస్థ ద్వారా అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారని ఈ ఛార్జ్‌షీట్‌లో ఈడీ స్పష్టం చేసిన విషయం విదితమే. దీని నుంచి రూ. 2,000 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా వారు పొందారని ఆరోపిస్తోంది.

Next Story