విమాన ప్రమాద విచారణలో కీలక పరిణామం.. DVRను స్వాధీనం చేసుకున్న గుజరాత్ ATS

by Kema Shiva Kumar |   (  Updated:2025-06-13 11:09:51  IST  )

అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై DGCA, AAIBతో పాటు గుజరాత్ ఏటీసీ విచారణను మరింత వేగవంతం చేశాయి.

విమాన ప్రమాద విచారణలో కీలక పరిణామం.. DVRను స్వాధీనం చేసుకున్న గుజరాత్ ATS
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై DGCA, AAIBతో పాటు గుజరాత్ ఏటీసీ విచారణను మరింత వేగవంతం చేశాయి. ఈ క్రమంలోనే ఇన్వెస్టిగేషన్‌లో భాగంగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్రాష్ అయిన బోయింగ్‌ 787-8 డ్రీమ్‌ లైనర్‌ ఫ్లైట్ శకలాల నుంచి డిజిటల్ వీడియో రికార్డర్‌(DVR)ను గుజరాత్ ఏటీఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో విమానం ప్రమాదానికి గురయ్యే ముందు ఫ్లైట్ లోపల రికార్డ్ అయిన పూర్తి ఫుటేజీ లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆ వీడియోలను అధికారులు రికవరీ చేసే పనిలో నిమగ్నమయ్యారు. అదేవిధంగా మరో కీలక పరికరం బ్లాక్ బాక్స్‌ కూడా దొరికితే.. ప్రమాదంపై అధికారులు పూర్తి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉంది.

Also Read..

UK investigation: ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై యూకే ఇన్వెస్టిగేషన్

Next Story