- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నీట్ పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం.. 26 మంది MBBS విద్యార్థుల సస్పెన్షన్
దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన నీట్-యూజీ 2024 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా సంచలనం గా మారిన నీట్-యూజీ 2024 (NEET-UG 2024) పేపర్ లీక్ కేసు (Paper leak case)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి.. నేషనల్ మెడికల్ కమిషన్ (NMC) 26 మంది MBBS విద్యార్థులను సస్పెండ్ చేసింది. అలాగే 14 మంది విద్యార్థుల 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను రద్దు చేసింది. ఈ చర్యలు శనివారం సాయంత్రం ప్రకటించబడ్డాయి. ఈ నీట్ 2024 పరీక్షల్లో పేపర్ లీక్, ఇంపర్సనేషన్, ఇతర అక్రమాల ఆరోపణలు వచ్చాయి. దీనిపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. చివరకు కోర్టు జోక్యం తో ఆ పరీక్షను రద్దు చేశారు.
జార్ఖండ్‌లోని ఓయాసిస్ స్కూల్‌లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ట్రంక్ నుండి ప్రశ్నపత్రం దొంగిలించిన "సాల్వర్ గ్యాంగ్",, MBBS విద్యార్థుల సహయంతో ప్రశ్నలను పరిష్కరించి, సమాధానాలను అభ్యర్థులకు అందించినట్లు విచారణలో వెళ్లడైంది. దీంతో 6 మంది MBBS విద్యార్థులు, పేపర్ లీక్‌లో సంబంధం ఉన్నారని, వీరు అక్రమ మార్గాల ద్వారా పరీక్షలో ఉత్తీర్ణులైనట్లు కనుగొనబడ్డారు. దీంతో వివిధ మెడికల్ కాలేజీలలో చదువుతున్న వారిని వెంటనే సస్పెండ్ చేయాలని NMC ఆదేశించింది. అలాగే మరో 14 మంది విద్యార్థుల 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు రద్దు చేశారు. ఎందుకంటే వారు నీట్-యూజీ 2024లో అన్యాయమైన మార్గాల ద్వారా ప్రవేశం పొందినట్లు నిర్ధారించారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పేపర్ లీక్ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటివరకు 21 మందిని అరెస్ట్ చేసింది.






