- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిహార్‌లో కీలక పరిణామం.. కేబినెట్ రద్దుకు నితీశ్ కుమార్ సిఫార్సు
నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్న తరుణంలో అంతకు ముందే కేబినెట్ రద్దుకు ఆయన గవర్నర్‌కు సిఫార్సు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: బిహార్ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. సీఎం నీతీశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. అయితే, రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కు సమర్పించడానికి ముందే, ఆయన ప్రస్తుత స్టేట్ కేబినెట్‌ను రద్దు చేయాలని గవర్నర్‌కు సిఫార్సు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. బిహార్‌కు కొత్త సీఎం ప్రచారం గత కొద్ది రోజులుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే నీతీశ్ కుమార్ తన పదవి నుంచి తప్పుకోనున్నారు. రాజీనామాకు ముందు కేబినెట్ రద్దు చేయడం ద్వారా, ప్రస్తుత ప్రభుత్వ పాలనకు అధికారికంగా తెరదించి, కొత్త ప్రభుత్వం ఏర్పడేందుకు మార్గం సుగమం చేస్తున్నారు.
ఎన్డీఏ కూటమి పార్టీల్లో ఉత్కంఠ..
నీతీశ్ కుమార్ రాజీనామా తర్వాత బిహార్ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే దానిపై ఉత్కంఠ నెలకొంది. జేడీయూ (JDU), బీజేపీ (BJP) కూటమిలో చోటుచేసుకున్న అంతర్గత మార్పులే ఈ నిర్ణయానికి కారణమని భావిస్తున్నారు. గవర్నర్‌ను కలిసిన తర్వాత నీతీశ్ కుమార్ తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. ఈ పరిణామంతో బిహార్‌లో కొత్త రాజకీయ సమీకరణాలు మొదలయ్యాయి.






