కెనెడా పౌరసత్వ నిబంధనలో కీలక మార్పు

by Muthe.Rajitha |

కెనడా పౌరసత్వ చట్టంలో కీలక మార్పు చేసింది.

కెనెడా పౌరసత్వ నిబంధనలో కీలక మార్పు
X

దిశ, వెబ్ డెస్క్ : కెనడా పౌరసత్వ చట్టంలో కీలక మార్పు చేసింది. ఈ మార్పు చేసిన చట్టం C-3 నిన్నటి నుంచి అమల్లోకి వచ్చింది. ఈ బిల్లుతో 2009 నుంచి ఉన్న “ఫస్ట్ జనరేషన్ లిమిట్”ను తొలగించారు. గతంలో కెనడా బయట జన్మించిన కెనడియన్ పౌరులు తమ పిల్లలకు (వారు కూడా కెనడా బయటే పుడితే) ఆటోమేటిక్‌గా పౌరసత్వం ఇచ్చేవారు కాదు. దీంతో “లాస్ట్ కెనడియన్స్” అనే సమస్య ఏర్పడింది. కొత్త చట్టం ప్రకారం డిసెంబర్ 15, 2025కు ముందు జన్మించి, పాత నిబంధన వల్ల పౌరసత్వం పొందని వారందరినీ ఆటోమేటిక్‌గా కెనడియన్ పౌరులుగా గుర్తిస్తారు.

డిసెంబర్ 15, 2025 తర్వాత కెనడా బయట జన్మించిన కెనడియన్ తల్లిదండ్రులు పౌరసత్వాన్ని అందించనున్నారు. అయితే పిల్లల జననం లేదా దత్తతకు ముందు తల్లిదండ్రులు కనీసం 3 ఏళ్లు కెనడాలో నివసిస్తే మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ మార్పులతో భారత సంతతి కెనడియన్లు సహా అనేక వలస కుటుంబాలకు కెనెడా పౌరసత్వం పొందడం మరింత సులభం కానుంది.

Next Story