సిమ్‌ బైండింగ్‌పై కేంద్రం కీలక ఆదేశాలు.. భారత్ బ్రాడ్‌బ్యాండ్ ఫోరం తీవ్ర అభ్యంతరం

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-02 09:22:17  IST  )

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సిమ్ బైండింగ్ (Sim Binding) నియమం పట్ల భారత్ బ్రాడ్‌బ్యాండ్ ఫోరం (BIF) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

సిమ్‌ బైండింగ్‌పై కేంద్రం కీలక ఆదేశాలు.. భారత్ బ్రాడ్‌బ్యాండ్ ఫోరం తీవ్ర అభ్యంతరం
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త సిమ్ బైండింగ్ (Sim Binding) నియమం పట్ల భారత్ బ్రాడ్‌బ్యాండ్ ఫోరం (BIF) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వాట్సాప్, సిగ్నల్, టెలిగ్రామ్ వంటి మెసేజింగ్ యాప్‌లను భారతీయ సిమ్‌తో లింక్ చేసి 90 నుంచి 180 రోజులకు ఒకసారి తప్పనిసరిగా వెరిఫై చేయించాలనే ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఆపిల్, గూగుల్, వాట్సాప్ వంటి ప్రముఖ సాంకేతిక సంస్థలను ప్రాతినిధ్యం వహిస్తున్న BIF, సైబర్ మోసాలను అరికట్టాలనే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశాన్ని స్వాగతిస్తున్నామని చెబుతూనే, వారు విధించిన నియమాల్లో చాలా లోపాలు ఉన్నాయని ఎత్తిచూపుతోంది.

సిమ్ బైండింగ్‌ను నిరంతరం వెరిఫై చేయాలంటే ఆపరేటింగ్ సిస్టమ్ (iOS, ఆండ్రాయిడ్) స్థాయిలో లోతైన ఇంటిగ్రేషన్ అవసరమని పేర్కొంది. ఇది అన్ని డివైస్‌లలో సాధ్యం కాదని, ముఖ్యంగా ఆపిల్ iOSలో అసాధ్యమని BIF వాదిస్తోంది. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవారు, రెండు డివైస్‌లు ఉన్నవారు, వెబ్ వెర్షన్‌పై ఆధారపడే కార్పొరేట్ ఉద్యోగులు ఈ నియమంతో తీవ్ర ఇబ్బందులు పడతారని కేంద్రం ఈ నిబంధనలను నిలిపివేయాలని BIF కోరుతోంది. అయితే, ప్రస్తుతం ఈ వివాదం కోర్టుకు చేరే అవకాశం ఉంది. గతంలో 2015–18లో టెలికాం రెగ్యులేటర్ (TRAI) ఇలాంటి ప్రయత్నాలు చేసినప్పుడు కోర్టులు అడ్డుకున్న విషయం తెలిసిందే.

Next Story