- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్లాబ్‌ల మార్పుపై GST మండలికి ఆర్థికశాఖ ప్రతిపాదనలు
స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా దేశంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా దేశంలోని పేద, మధ్య తరగతి కుటుంబాలకు ప్రధాని మోడీ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. నిత్యం వాడే ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగిస్తామని ప్రధాని మోడీ ప్రకటించారు. దీపావళి నాటికి రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ప్రధాని మోడీ ప్రకటన వెలువడిన వెంటనే కేంద్ర ఆర్థికశాఖ జీఎస్టీ గురించి కీలక ప్రకటన చేసింది. జీఎస్టీలో ఇకపై రెండు శ్లాబులే ఉండబోతున్నాయని వెల్లడించింది. అంతేకాదు.. స్లాబ్‌ల మార్పుపై GST మండలికి కేంద్ర ఆర్థికశాఖ ప్రతిపాదనలు చేసింది. జీఎస్టీ మండలి ఆమోదం వస్తే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు భారీ ఊరట లభించనుంది.
సంస్కరణలు అమలైతే.. 5 శాతం స్లాబ్‌లోకి 12 శాతం స్లాబ్‌లో ఉన్న దాదాపు 99 శాతం వస్తువులు రానున్నాయి. 12 శాతం స్లాబ్‌లోకి 28 శాతం స్లాబ్‌లో ఉన్న 90 శాతం వస్తువులు రానున్నాయి. విలాస వస్తువులు, సిన్ గూడ్స్‌పై 40 శాతం ప్రత్యేక స్లాబ్, ఈ 40 శాతం ప్రత్యేక స్లాబ్‌లోకి 7 శాతం వస్తువులు రానున్నాయి. దేశీయ వినియోగం పెంపే లక్ష్యంగా జీఎస్టీ స్లాబ్‌లలో మార్పుల ప్రతిపాదనలు చేశారు. భారీగా ఆదాయం కోల్పోతున్నా పన్నుల మార్పునకే కేంద్రం మొగ్గుచూపింది.






