- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
George Koovakad : కార్డినల్‌గా బాధ్యతలు స్వీకరించిన కేరళకు చెందిన జార్జ్ జాకబ్
దిశ, నేషనల్ బ్యూరో : భారత్‌లోని కేరళ(Kerala)కు చెందిన 51 ఏళ్ల జార్జ్ జాకబ్ కూవకడ్(George Koovakad) క్రైస్తవ మత కార్డినల్(Cardinal) గా బాధ్యతలు స్వీకరించారు.

దిశ, నేషనల్ బ్యూరో : భారత్‌లోని కేరళ(Kerala)కు చెందిన 51 ఏళ్ల జార్జ్ జాకబ్ కూవకడ్(George Koovakad) క్రైస్తవ మత కార్డినల్(Cardinal) గా బాధ్యతలు స్వీకరించారు. శనివారం రాత్రి వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ బసిలికాలో ఘనంగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పోప్ ఫ్రాన్సిస్(Pope Francis) సమక్షంలో కార్డినల్‌గా జార్జ్ జాకబ్ బాధ్యతలను చేపట్టారు. ఈసందర్భంగా జార్జ్ జాకబ్ సహా వివిధ దేశాలకు చెందిన మొత్తం 21 మంది నూతన కార్డినల్స్‌గా నియమితులయ్యారు.
తొలుత వీరిని ఉద్దేశించి పోప్ ఫ్రాన్సిస్ ప్రసంగించారు. అనంతరం కొత్త కార్డినల్స్‌కు సంప్రదాయ క్యాప్, రింగ్‌లను ఆయన ప్రదానం చేశారు. ప్రార్థనలు ముగిశాక నూతన కార్డినల్స్‌కు సర్టిఫికెట్లను పోప్ అందజేశారు. జార్జ్ జాకబ్ చేరికతో మొత్తం కార్డినల్స్‌లో భారతీయుల సంఖ్య ఆరుకు పెరిగింది. వాటికన్ సిటీలో జరిగిన ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వం తరఫున కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి జార్జ్ కురియన్ పాల్గొన్నారు. జార్జ్ జాకబ్‌కు కార్డినల్‌గా అవకాశం దక్కినందుకు భారత్ గర్విస్తోందని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ట్వీట్ చేశారు.






