- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kerala: కేరళలో ఉష్ణోగ్రతల పెరుగుదల.. లేబర్ కమిషన్ కీలక నిర్ణయం
కేరళలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో, కేరళ లేబర్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికుల పనివేళల్లో మార్పులు చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో, కేరళ లేబర్ కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కార్మికుల పనివేళల్లో మార్పులు చేసింది. సన్ స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించేందుకు మూడు గంటల విశ్రాంతి తప్పనిసరని చెప్పింది. ఈ షెడ్యూల్ మే 10 వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఏదైనా పొడిగింపుపై నిర్ణయం తీసుకునే ముందు అధికారులు పరిస్థితిని సమీక్షించాలని నిర్ణయించారు. కొత్త మార్గదర్శకాల ప్రకారం, పని వేళలు ఉదయం 7 నుండి సాయంత్రం 7 గంటల వరకు ఉంటాయి. అయితే, మధ్యాహ్నం 12 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు విశ్రాంతి తీసుకోవాలి. షిఫ్ట్‌లలో పనిచేసే వారికి, షెడ్యూల్‌లను పునర్వ్యవస్థీకరిస్తారు. ఈ ఆదేశాన్ని పాటించేలా చూసుకోవడానికి ప్రత్యేక బృందాలను మోహరిస్తామని కార్మిక కమిషనర్ సఫ్నా నసరుద్దీన్ తెలిపారు. ఈ బృందాలు డిస్ట్రిక్ లేబర్ ఆఫీసర్ సహా ఇతర అధికారుల పర్యవేక్షణలో పనిచేస్తాయన్నారు. రోజువారి తనిఖీలు నిర్వహిస్తామన్నారు. నిర్మాణ, రోడ్డు పనుల కార్మికులపై కఠినమైన పర్యవేక్షణ అమలు చేస్తామన్నారు. అయితే, సముద్ర మట్టానికి 3 వేల అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతాలకు.. అంటే సూర్యరశ్మి తక్కువగా ఉండే ప్రాంతాలకు ఈ ఉత్తర్వు నుంచి మినహాయింపు ఇచ్చారు.






