- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బలవంతంగా యుద్ద భూమికి పంపిన రష్యా.. భారతీయుడు మృతి
రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దంలో గత కొన్నాళ్లుగా ఫ్రంట్‌లైన్ వారియర్‌గా పని చేస్తున్న టీబీ. బినీల్ అనే వ్యక్తి ఉక్రెయిన్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు.

- ఉక్రెయిన్ యుద్దంలో మరణించిన కేరళ వాసి
- మరో వ్యక్తికి తీవ్ర గాయాలు
- ధృవీకరించిన ఇండియన్ ఎంబసీ
దిశ, నేషనల్ బ్యూరో:
రష్యా కిరాయి దళంలో పని చేస్తున్న కేరళ వాసి ఒకరు యుద్ద భూమిలో ప్రాణాలు కోల్పోయారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్దంలో గత కొన్నాళ్లుగా ఫ్రంట్‌లైన్ వారియర్‌గా పని చేస్తున్న టీబీ. బినీల్ అనే వ్యక్తి ఉక్రెయిన్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ మేరకు సోమవారం మృతుడి కుటుంబీకులకు ఇండియన్ ఎంబసీ సమాచారం అందించింది. ఇదే గ్రూపులోఉన్న మరో మలయాళీ జైన్ తీవ్రంగా గాయపడి మాస్కోలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. రెండు రోజుల క్రితమే జైన్‌ను యుద్దభూమి నుంచి మాస్కోలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచే కేరళలోని తన కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి తాను ఆసుపత్రిలో ఉన్న విషయాన్ని చెప్పినట్లు తెలిసింది.
రష్యా సైన్యం కోసం పని చేయడానికి వంట వాళ్లు, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు కావాలని ప్రకటన రావడంతో నిరుడు ఏప్రిల్‌లో వీరిద్దరూ కేరళ నుంచి రష్యా వెళ్లారు. అక్కడకు వెళ్లిన తర్వాత బలవంతంగా వారి పాస్‌పోర్టులను గుంజుకొని, రష్యాలో పర్మనెంట్ రెసిడెన్స్ కోసం అప్లయ్ చేయించారు. ఆ తర్వాత వారిని రష్యా కిరాయి సైన్యంలో సోల్జర్స్‌గా విధుల్లో నియమించారు. ఈ విషయాన్ని అప్పుడే ఆ ఇద్దరు యువకులు ఇండియాలోని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. తాము తిరిగి ఇండియాకు వచ్చేస్తామని, సాయం చేయమని ఇండియన్ ఆర్థడక్స్ చర్చ్ అధిపతి బాసిలియోస్ మార్తోమా మాథ్యూస్‌కు చెప్పారు. ఆయన రష్యన్ అంబాసిడర్ డెనిస్ అలిపోవ్‌ను ఈ విషయంలో సాయం చేయాల్సిందిగా అభ్యర్థించారు. కానీ వారి అభ్యర్థనను రష్యా పట్టించుకోలేదు. వారు ఉక్రెయిన్‌లో చిక్కుకొని పోయారని.. తిరిగి రష్యాలో అడుగు పెడితే భారత్‌కు పంపిస్తామని చెప్పారు. కానీ ఇంతలోనే ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. నిరుడు ఏప్రిల్ 19న కూడా కేరళకు చెందిన సందీప్ చంద్రన్ అనే వ్యక్తి ఇలాగే యుద్ద భూమిలో ప్రాణాలు కోల్పోయాడు. అప్పుడు అందిని ఫిర్యాదుతో సీబీఐ పలు విదేశీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలపై దాడులు నిర్వహించింది.






