- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kerala: హిందూ మహిళలూ ఎక్కువ మంది పిల్లలను కనండి.. కేరళ ఈళవ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
హిందూ మహిళలు అలా చేయవద్దని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

దిశ, నేషనల్ బ్యూరో: కేరళలోని ప్రముఖ హిందూ ఈళవ సామాజిక వర్గ నేత వెల్లపల్లి నటేసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేరళ త్వరలో ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారవచ్చని, ఇందుకు హిందూ మహిళల్లో పునరుత్పత్తి తగ్గిపోవడమే కారణమని అన్నారు. హిందూ మహిళలు అలా చేయవద్దని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కొట్టాయంలో జరిగిన శ్రీ నారాయణ ధర్మ పరిపాలన (ఎస్ఎన్‌డీపీ) యోగం సమావేశంలో నటేసన్ మాట్లాడుతూ.. అధికార ఎల్‌డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ రెండూ ముస్లిం సమాజానికి రాజకీయంగా సహాయం చేస్తున్నాయని, హిందువులు తమ ప్రాబల్యం కాపాడుకునేందుకు ఐక్యంగా ఉండాలన్నారు. ఈళవ సామజిక వర్గం ఏకమైతే కేరళను ఎవరు పాలించాలో మనమే నిర్ణయించుకోవచ్చు. రాష్ట్రంలోని పాఠశాలల సమయాలను మార్చాలనే ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ నిర్ణయం, పాఠశాలల్లో జుంబా నృత్యం అమలుపై ఇటీవల తలెత్తిన వివాదాలను ఉటంకించిన ఆయన, మైనారిటీ సమాజం, దాని నేతలు రాష్ట్ర పరిపాలనలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. కోర్టు ఆదేశాల ప్రకారం, విద్యా శాఖ పాఠశాల సమయాలను పెంచాలనుకున్నప్పుడు, ప్రభుత్వం ఓనం, క్రిస్మస్ సెలవులను తగ్గించవచ్చని సమస్త (ఓ ప్రముఖ ముస్లిం సంస్థ) చెప్పింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశం ఎక్కడికి వెళుతోంది? ఈ పరిణామాలతో మనదేశంలో ఇకపై లౌకికవాదం ఉండదని ' అని ఆయన వెల్లడించారు.
ఈ సందర్భంగా, 2040 నాటికి కేరళ ముస్లిం-మెజారిటీ రాష్ట్రంగా మారుతుందని మాజీ కేరళ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ వ్యాఖ్యను నటేసన్ కూడా ప్రస్తావించారు. మనం 2040 వరకు వేచి ఉండాల్సిన అవసరం లేదు. అలప్పుళ జిల్లాలో హిందువులు పునరుత్పత్తిని తగ్గించడంతో రెండు సీట్లు తగ్గాయి. మలప్పుళలో పునరుత్పత్తిని పెంచడంతో నాలుగు సీట్లు పెరిగాయి. కాబట్టి ప్రజలందరికీ నా విన్నపం ఏంటంటే.. హిందూ మహిళలు పునరుత్పత్తిని తగ్గించవద్దని చెప్పారు. కాగా, గతంలోనూ నటేసన్ ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలే చేశారు. ఏప్రిల్‌లో కేరళలోని మలప్పుళ జిల్లాలో జరిగిన ఒక సమావేశంలో ప్రసంగిస్తూ.. ముస్లింలు ఎక్కువగా ఉన్న జిల్లాను 'వేరే దేశం' అని అన్నారు.






