- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దోషి చిన్న వయస్సు వాడని శిక్ష ఒక్కరోజుకు తగ్గింపు.. కేరళ హైకోర్టు సంచలన తీర్పు
నేరం చేసిన సమయంలో దోషి చిన్న వయస్సు వాడని కేరళ హైకోర్టు (Kerala High Court) సంచలన నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్: నేరం చేసిన సమయంలో దోషి చిన్న వయస్సు వాడని కేరళ హైకోర్టు (Kerala High Court) సంచలన నిర్ణయం తీసుకుంది. దోషికి పడిన శిక్షను ఒక్క రోజుకు తగ్గిస్తూ జడ్జి తీర్పును వెలువరించింది. 2008 లో జరిగిన ఘటన ప్రకారం.. 19 ఏళ్ల యువకుడు 12 ఏళ్ల బాలుడిపై లైంగిక నేరానికి ప్రయత్నించాడన్న కేసులో ఓ ట్రయల్ కోర్టు (Trail Court) 2014 లో తీర్పును ఇచ్చింది. సెక్షన్ 377 ప్రకారం నిందితుడిని దోషిగా తేలుస్తూ.. 4 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 10 వేల జరిమాన విధించింది. అంతేగాక బాలుడిని బెదిరింపులకు గురి చేసినందుకు మరో సంవత్సరం జైలు శిక్షను కూడా అమలు చేయాలని తీర్పునిచ్చింది.
ట్రయల్ కోర్టు తీర్పులో అసమానతలు ఉన్నాయని భావించిన దోషి.. తీర్పును కేరళ హైకోర్టులో సవాల్ చేశాడు. దీంతో ఈ కేసును ఇటీవల విచారణ చేపట్టిన కేరళ హైకోర్టు జడ్జి సీఎస్ సుధ (Kerala High Court Judge CS Sudha) సంచలన తీర్పును (sensational verdict) వెలువరించింది. ఈ కేసులో పిటిషనర్ వాంగ్మూలంలో వ్యత్యాసాలు ఉన్నాయని, ఈ కేసు సెక్షన్ 377 కిందకు రాదని, సెక్షన్ 511 (నేరం చేయడానికి ప్రయత్నించడం) మాత్రమే అవుతుందని చెప్పింది.
అంతేగాక నేరం జరిగిన సమయంలో దోషి వయస్సు తక్కువగా ఉన్నదని, నేరం చేయడానికి ప్రయత్నం మాత్రమే జరిగిందని, నేర నిర్ధారణ కాలేదని చెబుతూ.. నేరస్థుడికి పడిన శిక్షను ఒక రోజుకు తగ్గిస్తూ తీర్పును వెలువరించింది. అలాగే 25 వేల పరిహరాన్ని తక్షణమే చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. కాగా 2008 అక్టోబర్ లో 19 ఏళ్ల వ్యక్తి తనని ఖాళీగా ఉన్న ఓ ఇంట్లోకి తీసుకెళ్లి నేలపైకి నెట్టాడని, బట్టలు విప్పి తన ప్రైవేట్ పార్ట్ ను లాగాడని ఆ సమయంలో తనకు విపరీతమైన నొప్పి కలిగిందని 12 బాలుడు ఆరోపించాడు. అంతేగాక ఈ విషయం ఎవరికి చెప్పవద్దని తనని బెదిరించాడని బాధితుడు పేర్కొన్నాడు.






