- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kashmir terror attack: ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న కేరళ జడ్జిలు, ఎమ్మెల్యేలు
జమ్ముకశ్మీర్‌లోని పెహల్గాం (Pahalgam Terror attack) ఉగ్రదాడి నుంచి కేరళ హైకోర్టు న్యాయవాదులు(Kerala High Court judges),, ఎమ్మెల్యేల బృందం త్రుటిలో తప్పించుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లోని పెహల్గాం (Pahalgam Terror attack) ఉగ్రదాడి నుంచి కేరళ హైకోర్టు న్యాయవాదులు(Kerala High Court judges),, ఎమ్మెల్యేల బృందం త్రుటిలో తప్పించుకుంది. ఈ విషయాన్ని కేరళ సీఎంవో వెల్లడించింది. ‘‘జమ్ముకశ్మీర్ పర్యటనకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్ కే నరేంద్రన్, జస్టిస్ పీజీ అజిత్ కుమార్, జస్టిస్ జి.గిరీష్.. ఎమ్మెల్యేలు ముకేష్, కేపీఏ మజీద్, టి. సిద్ధిక్, కె.అన్నాలన్ వెళ్లారు. ఉగ్రదాడి నుంచి వారంతా త్రుటిలో తప్పించుకున్నారు. ప్రస్తుతం వీరందరూ శ్రీనగర్‌లో సురక్షితంగా ఉన్నారు. జమ్ముకశ్మీర్‌లో చిక్కుకున్న కేరళ ప్రజలను సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం’’ అని ప్రకటనలో పేర్కొంది.
కొచ్చికి చెందిన వ్యక్తి మృతి
అంతేకాకుండా, ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో కొచ్చిలోని ఎడపల్లికి చెందిన ఎన్. రామచంద్రన్ ప్రాణాలు కోల్పోయారు. దీనిపై కేరళ సీఎం పినరయి విజయన్ విచారణం వ్యక్తం చేశారు.‘‘ఎర్నాంకులమ్‌కు చెందిన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. అతడి కుటుంబసభ్యులను జాగ్రత్తగా ఇంటికి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తామని సీఎం తెలిపారు’’ అని సీఎంవో తెలిపింది. కాగా.. పెహల్గామ్ కు సైనికుల దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పురుషులే లక్ష్యంగా దాడులు చేశారు. ఈ దాడుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోయారు. కాగా.. దాడి తర్వాత అడవుల్లోకి పారిపోయిన ముష్కరులను పట్టుకునేందుకు భద్రతాబలగాలు ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయి.
Read Also..
Pahalgam Attack: బార్డర్‌లో వార్ టెన్షన్! పహెల్గం ఎటాక్ తర్వాత పాక్ కుయుక్తులు






